Social Media లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Social Media లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జూన్ 2025, మంగళవారం

Meghalaya Couple Missing : మేఘాలయ హనీమూన్ ట్రాజెడీ: హనీమూన్ ట్రిప్ ని భర్త అంతిమయాత్ర గా మార్చిన భార్య - దర్యాప్తులో దుమారం!

 

                           
Meghalaya Couple Missing

                

🔎 కాపురం కంటే కుట్రే ముందా?

Meghalaya Couple Missing Case : మేఘాలయ  పర్యటనలో హనీమూన్‌కు వెళ్లిన భార్యాభర్తల కథ ఒక్కసారిగా పెళ్ళికి ముందు ప్రేమ, కుట్ర, సుపారీ గాంగ్, హత్య వంటి అంశాల కలయికతో  మలుపు తిరిగిన  సంచలన కేసుగా మారింది. మధ్యప్రదేశ్‌కి చెందిన రాజా రఘువంశి శవం అగాధంలో కనిపించగా, ఆయన భార్య సోనం రఘువంశి ఎక్కడికిపోయిందన్న ప్రశ్న దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ నిదానంగా వెలుగులోకి వచ్చిన నిజాలు పోలీసులనే షాక్‌కు గురిచేశాయి.


📅 సంఘటనల క్ర‌మంలో:

  • మే 23: హనీమూన్ పర్యటనలో రాజా మరియు సోనం రఘువంశి మెఘాలయలో కనిపించిన చివరి రోజు

  • జూన్ 2: రాజా శవం Weisawdong ఫాల్స్ సమీపంలోని అగాధంలో కనిపించటం

  • జూన్ 7: సోనం ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన రోజు

💔 ప్రేమగా మొదలై హత్యగా ముగిసిన కొత్త జీవితం

సోనం తన భర్తను హత్య చేయించేందుకు ముగ్గురు హిత్‌మెన్లను ఏర్పాటు చేసిందని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. దర్యాప్తులో ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్రధాన సూత్రధారి అని బయటపడింది. సోనం – రాజ్ కలిసి ఈ దారుణ  హత్య కు ప్లాన్‌ను రూపొందించారట.


 హనీమూన్ విహారం  కాదు, మృత్యు కుహరం !

పోలీసుల కథనం ప్రకారం, సోనం తన భర్తను చెరాపుంజీలోని ఒంటరిగా ఉన్న మార్గానికి తీసుకెళ్లి అక్కడ హత్య చేయించేలా ప్లాన్ చేసిందట. హత్య అనంతరం, ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులు గౌహతికి వెళ్లి ఒక రోజు అక్కడ తలదాచుకున్నారు.


🔐 నిందితుల అరెస్టులు – దశల వారీగా సాగిన ఆపరేషన్

  • సోనం రఘువంశి – ఉత్తరప్రదేశ్‌ గాజీపూర్‌లోని ఒక ధాబాలో పట్టుబడి పోలీసులు విచారణకు తీసుకెళ్లారు

  • రాజ్ కుష్వాహా – సోనం ప్రియుడు, ప్రధాన సూత్రధారి, కస్టడీలో

  • విక్కీ ఠాకూర్, ఆకాశ్, ఆనంద్ – హత్యకు పాల్పడిన వ్యక్తులు, మధ్యప్రదేశ్‌లో అరెస్ట్


📱 సాంకేతిక ఆధారాలు – ఫోన్, సీసీటీవీ, రైడింగ్ స్కూటర్

  • హత్యకు ముందు సోనం, రాజ్ తరచూ ఫోన్‌లో మాట్లాడిన రికార్డులు

  • హోటల్‌లో సీసీటీవీ ఫుటేజీ ద్వారా సోనం ఉండటం రుజువు

  • హత్య జరిగిన ప్రాంతం సమీపంలో రత్తం మచ్చలతో ఉన్న మాచెటీ, రెయిన్‌కోట్, మరియు స్కూటర్‌ ఆధారాలు


ధాబా వ్యక్తి సమాచారం  – “ఆమె ఏడుస్తూ ఫోన్ అడిగింది...”

ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్ ధాబా వద్ద సోనం కనిపించిందని అక్కడి సిబ్బంది చెప్పారు. “ఆమె ఏడుస్తూ ఫోన్ కావాలని అడిగింది. తర్వాత తన సోదరుడికి కాల్ చేసింది. తర్వాత మేమే పోలీసులకు సమాచారం ఇచ్చాం,” అని ఒక సిబ్బంది తెలిపారు.


👮‍♀️ పోలీసుల ప్రకటన: “సోనం స్వయంగా లొంగిపోయింది”

మెఘాలయ పోలీసు అధికారి ఈదాశిషా నోంగ్రాంగ్ ప్రకారం, సోనం గాజీపూర్‌లోని నందగంజ్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా లొంగిపోయిందని తెలిపారు. ఆమెతో పాటు మొత్తం ఐదుగురు అరెస్ట్ చేయబడి, శిలాంగ్‌కు తరలింపు చేపట్టారు.


కుట్ర వెనుక ప్రేమ సంబంధమా?

ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉండటం బయటపడింది. సోనం – రాజ్ కుష్వాహా వివాహానికి ముందు నుంచే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత కూడా వారి మధ్య ఫోన్ ద్వారా సంభాషణలు కొనసాగుతూనే ఉన్నాయని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.


హతుడి తండ్రిని ఓదార్చిన హంతకుడు !

బండారం బట్టబయలు కాకముందు రాజా రఘు వంశీ మృతదేహం ఇంటికి తీసుకు వచ్చినప్పుడు, హంతకుడు రాజ్ కుష్వాహ వంశీ తండ్రిని ఓదారుస్తూ, తోడుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసి, ఏమీ ఎరగనట్టు వారికి మద్దతుగా నిలిచిన నిందితుని నిజాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటి మానవ మృగాలను ఎన్ కౌంటర్ చేయాలన్న తీవ్ర వ్యాఖ్యానాలతో విరుచుకుపడుతున్నారు. 


⚖️ చివరగా – చట్టం ముందు నిందితులు, బాధితుడికి న్యాయం కోరతాం

ఇప్పుడు ఈ కేసు న్యాయ విచారణ దశకు చేరింది. దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. నూతన జీవితం మొదలు పెట్టిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి చేతిలోనే హత్యకు గురయ్యాడంటే ఎంత దురదృష్టకరం! బాధితుడికి న్యాయం జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు.


ఇష్టం లేని పెళ్లి కి తల వంచడం ఎందుకు ? జీవిత భాగస్వామి అన్న కనికరం లేకుండా..కాళ్ళ పారాణి ఆరకుండానే అంత మొందించడం ఎందుకు ? ఒక సామాన్య యువతికి ఇంత దారుణ ఆలోచనలు కలగడానికి కారణం ఏమిటి ? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు.. ఈ అమానుష ఘటనతో రెండు కుటుంబాల భవితవ్యం అల్లకల్లోలం, అగమ్యగోచరం అయ్యింది. పదే పదే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతుండడం దేనికి సంకేతం? మానవ సమాజం నాగరికం వైపు పయనిస్తుందా..ఆటవిక సమాజం వైపు అడుగులు వేస్తుందా? ప్రతి ఒక్కరం ఆలోచన చేయాల్సిన తరుణం. 

17, మే 2025, శనివారం

Odisha Murder : పెంచిన తల్లినే కడతేర్చిన పెంపుడు కూతురు: ఒడిశాలోని దారుణ హత్య వెనుక చీకటి నిజాలు

 

                                            
Odisha Murder

ఒక తల్లి…
ఆమెకు బిడ్డలు లేరు ...
ఒక అనాథ బాలికను రోడ్డుపై కనిపించగానే గుండె కలవరపడింది...
తన కూతురిలా అక్కున చేర్చుకుంది..ఆదరించింది..ఆశ్రయం ఇచ్చింది.. ప్రేమను పంచింది..తన ప్రాణంగా  పెంచింది...
కాని... ఆ తల్లి అపురూప  ప్రేమకు బదులుగా ఆ కూతురు ఏమిచ్చిందో  తెలుసా...?


ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వాన్ని మంటగలిపింది. భువనేశ్వర్‌కు చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ దాదాపు 14 ఏళ్ల క్రితం రోడ్డుపై దొరికిన ఓ చిన్నారిని తన దత్తపుత్రికగా తీసుకుంది. తన స్వంత కూతురిలా చూసుకుంది. భర్త మరణం తర్వాత ఒక్కతే అన్నీ బాధ్యతలు భుజాన వేసుకొని ఆమెను విద్యాబుద్ధులు నేర్పిస్తూ, కష్టపడుతూ వచ్చారు. కుమార్తె చదువు కోసం భువనేశ్వర్ నుండి పర్లాకిమిడికి సైతం మకాం మార్చింది. 

ఆ బాలిక ఇప్పుడు 13 ఏళ్ల వయసులో ఉన్న 8వ తరగతి విద్యార్థిని. కానీ మొబైల్ ఫోన్ మాయలో చిక్కి, ప్రేమ అనే ముసుగులో  వయోజనులతో అనుచిత సంబంధాల్లో పడింది. ఇదే ఆమెను హేయమైన మార్గానికి నడిపించింది.

మారిపోయిన మనసు – మృత్యు ఘంటికగా  మారిన బాలిక

ఆ బాలిక  రథ్, సాహు  అనే వారితో తో సంబంధం పెట్టుకుంది. రథ్  ఆమె తల్లి రాజ్యలక్ష్మిని భూమిపై లేకుండా చేస్తే , అప్పుడే తమ  ప్రేమ విజయవంతమవుతుందని, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చని  మాయమాటలు చెప్పాడు. ఆస్తి ఆశ, అడ్డంకిలేని జీవితం అనే దురాశ, లోభం  రథ్‌ను ఆ హత్యకు ప్రేరేపించాయి. దీనికి సాహు  కూడా మద్దతు పలకడంతో  ముగ్గురు హత్యా పథకాన్ని సిద్ధం చేశారు.

ఏప్రిల్ 29 – ప్రేమ అంధత్వంలో తల్లిని చంపిన రోజు

ఆరోజు రాత్రి… బాలిక తన పెంపుడు తల్లికి నిద్రమాత్రలు ఇచ్చింది. స్పృహ తప్పిన తర్వాత రథ్, సాహులను పిలిచింది. ముగ్గురు కలిసి ఒక దిండుతో రాజ్యలక్ష్మిని ఊపిరాడకుండా చేసి హతమార్చారు.

తరువాత నాటకం మొదలైంది – "తల్లి లేవడంలేదు" అంటూ ఇతరులను పిలిచింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే ఆమె మృతి చెందింది. గుండెపోటుగా  అనుమానించారు మొదట. కానీ రాజ్యలక్ష్మి సోదరుడు సిబ ప్రసాద్ బాలిక ఫోన్‌లో ఉన్న ఆధారాలు పరిశీలించి అసలు కథను బయటపెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో హత్యా కుట్ర బయటపడింది.

అనాథ చిన్నారి నుంచి అనాగరిక హంతకురాలు  వరకు: సమాజానికి ఇస్తున్న  సందేశం

ఈ సంఘటన అనేక ప్రశ్నలు రేపుతుంది:

  • చిన్న వయసులోనే బాలికను ఫోన్ ప్రపంచం ఎందుకు మాయ చేసింది?

  • పెంపుడు తల్లి ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది?

  • సమాజంగా పిల్లలకు సరైన మార్గదర్శనం ఇవ్వడంలో మనం  మేమేమి కోల్పోతున్నాం?

ముద్దుల బాలికనైన అమ్మాయిని… అంత కిరాతకంగా మలచిన వాట్సాప్, మొబైల్ వాడకం, కలుసుకున్న మోసగాళ్ల ప్రభావం — ఇవన్నీ అందరికీ హెచ్చరికలే.


చివరగా…

ఒక అమ్మ ప్రేమకి మించినదేమీ ఉండదు. కానీ ఆ ప్రేమను అర్థం చేసుకోని మనసులు ఎన్నో తల్లుల గుండెలను పగులగొడుతున్నాయి. ఈ సంఘటనను చదివిన ప్రతి ఒక్కరూ — "ఇలా జరగకూడదు" అనే ఆలోచనతో, తమ పిల్లలపై ప్రేమతో పాటు సరైన పర్యవేక్షణ కూడా ఉండేలా చూసుకోవాలి.



 "ఈ తరహ సంఘటనలు ఇటీవల ఎందుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి?" అనే ప్రశ్నకి సూటిగా, వ్యవస్థను, సమాజాన్ని, కుటుంబాన్ని, టెక్నాలజీని, బాలల మానసిక వికాసాన్ని విశ్లేషిస్తూ చేస్తున్న అధ్యయనాలలో వాలుగు చూస్తున్న కొన్ని వాస్తవాలు.


🧠 1. మానసిక పరిపక్వత లేని వయసులో "స్వేచ్ఛ"

పిల్లలకు చిన్న వయసులోనే ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారు ఇంకా మానసికంగా పరిపక్వతను పొందకముందే పెద్దల ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఈ వయస్సులో భావోద్వేగాలను, మంచి చెడు తేడాలను అర్థం చేసుకోవడంలో వాళ్లు విఫలమవుతున్నారు.


📱 2. మొబైల్, సోషల్ మీడియా మాయలో పడటం

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్ వీడియోలు… ఇవన్నీ కొన్ని గంటల వినోదాన్ని ఇచ్చినా, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తమ వయస్సుకి మించిన సంబంధాల్ని ఏర్పరచడం, చాటింగ్ ద్వారా మోసగాళ్ల వలలో పడటం, "అభిజాత గాథలు"ని నిజంగా అనుకోవడం వంటి మాయ లోకంలో తేలిపోతున్నారు.


👨‍👩‍👧 3. తల్లిదండ్రులు తగిన శ్రద్ద వహించకపోవడం 

మానవ జీవితాల్లో తల్లిదండ్రుల దైనందిన తీరు మారిపోతుంది. ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపలేకపోతున్నారు. వాత్సల్యంగా  పెంచడమే కాకుండా, పరిమితులతో కూడిన ప్రేమ, పర్యవేక్షణతో కూడిన స్వేచ్ఛ ఇవ్వకపోవడం మూలంగా, పిల్లలు సరైన దారి మర్చిపోతున్నారు.


📚 4. విద్యా విధానంలో "మానవ విలువల"కు స్థానం లేకపోవడం

ఇప్పటి విద్యా వ్యవస్థ ఎక్కువగా మార్కులు, పోటీ, టెక్నాలజీ మీద దృష్టి పెట్టింది కానీ, నైతిక విలువలు, సంస్కారం,కుటుంబ బాంధవ్యాలు,  సహనానికి అవసరమైన జీవన పాఠాలు చెప్పడంలో వెనుకబడి ఉంది. ఈ లోటు వ్యక్తిత్వ వికాసంలో గంభీరంగా ప్రభావితం చేస్తోంది.


⚖️ 5. చట్టాల మీద భయం లేకపోవడం

చిన్న వయసులో ఉన్నారని, నేరాలకు చిన్న శిక్షలు ఉంటాయని తెలిసిన కొంతమంది యువకులు ఉత్సాహంతో క్రిమినల్ మైండ్‌ను పెంచుకుంటున్నారు. చట్టాల పట్ల భయం లేకపోవడమూ ఒక ప్రధాన కారణం.


💔 6. ప్రేమ అనే భావనను అర్థం చేసుకోలేకపోవడం

ప్రేమ అనేది బాధ్యతతో కూడిన సంబంధమని తెలుసుకోకుండా, చిన్న వయసులో ఆకర్షణను ప్రేమగా భావించడం, తల్లిదండ్రుల సలహాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ విధమైన ఘోరాలు జరుగుతున్నాయి.


ముందుకు ఎలా..? (సమాజం ఏం చేయాలి)

  1. తల్లిదండ్రులు పిల్లలతో ప్రతి రోజు కూర్చొని మాట్లాడాలి.

  2. స్కూళ్లలో మానవీయ విలువలు, ఇంటర్నెట్ భద్రత పాఠాలు బోధించాలి.

  3. పిల్లలకు మొబైల్ వాడకంపై సమయ పరిమితులు విధించాలి.

  4. నేరచరిత్ర గల వారితో సంబంధాలపై ఆరా తీసే విధానం ఉండాలి.

  5. చిన్న వయస్సులో ప్రేమలో పడటాన్ని గౌరవంగా కాకుండా, అది మానసిక, శారీరక పరిపక్వత లేకుండా చేసే పనిగా  వివరించాలి.


ఈ సంఘటనలు సమాజానికి గట్టి హెచ్చరికలు.
ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి టీచర్, ఇలా ప్రతివారూ చురుగ్గా ముందుకు వచ్చి పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాల్సిన సమయం ఇది.

"పిల్లలు మన భవిష్యత్తు" అని చెప్పడమే కాదు, ఆ భవిష్యత్తును నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దడం మన బాధ్యత.


5, ఏప్రిల్ 2025, శనివారం

Social Media Effects : సోషల్ మీడియా - రెండు వైపులా పదును ఉన్న కత్తి

 


                                                                 
Social Media Effects

📌 సమాజంపై సోషల్ మీడియా యొక్క స్థిరమైన బలహీనతలు & ప్రభావాలు

ప్రస్తుతం మనం జీవిస్తున్న సమాజం ‘డిజిటల్ ఆధారిత సమాజం’గా మారిపోయింది. పాత కాలంలో సమాచారం,విజ్ఞానం  కోసం వార్తాపత్రికలు, సినిమాలు, టీవీలు మాత్రమే  ఆధారంగా ఉండేవి. కానీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో  ఇప్పుడు ఒక్క సెల్‌ఫోన్ ఉంటే చాలు యావత్ ప్రపంచమే  మన చేతిలో ఇమిడి పోతుంది. ఇందులో కీలక పాత్ర పోషించేది – సోషల్ మీడియా. ఒక వ్యక్తి నుండి ప్రపంచ స్థాయి సంస్థలు, వ్యవస్థల వర్తమానాన్ని, భవిష్యత్ ను క్షణాలలో తలక్రిందులు చేసేస్తున్నసాంకేతిక  సాధనం. మారు మూల కుగ్రామం లోని ఒక సాధారణ వ్యక్తిని రాత్రికి రాత్రి ప్రపంచ ప్రభావ శీల వ్యక్తిని చేయగలదు. ప్రపంచస్థాయి సెలబ్రిటీలను సైతం గంటల వ్యవధిలో బికారులను చేయగలదు. రెండు వైపులా పదును ఉన్న చురుకైన  కరవాలం  ఈ సోషల్ మీడియా . ఈ కత్తి వైద్యుని చేతిలో ఉంటే ప్రాణం పోస్తుంది..ఉన్మాది చేతిలో ఉంటే ప్రాణం తీస్తుంది. వినియోగించే విధానం బట్టే సోషల్ మీడియా ప్రభావం ఆధారపడి ఉంటుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి  మెలగాలి.


👍సోషల్ మీడియా సానుకూల ప్రభావాలు  – Positive Side of Social Media


1. 📣 వ్యక్తి అభివృద్ధికి తోడ్పాటు

తమలో దాగివున్న  విషయాలను, కళలను, ప్రతిభను ప్రపంచానికి చూపించుకోవడం ద్వారా వ్య‌క్తి ఎదుగుదలకు పెద్ద అవకాశాలు లభిస్తున్నాయి.

ఉదాహరణ: ఒక చిన్న గ్రామంలో పుట్టిన సంగీత కళాకారుడు తన పాటలను YouTube లో పోస్ట్ చేయడం ద్వారా మిలియన్ల మంది దృష్టిని ఆకర్షించగలడు. బాలీవుడ్ లేడీ సింగర్ రేణు మండల్ ( Renu Mandal ) ఒక తాజా ఉదాహరణ. ఒక బిచ్చగత్తె సోషల్ మీడియా ప్రభావంతో అతి తక్కువ కాలంలోనే విస్తృత ప్రజాదరణ పొంది బాలీవుడ్ లో సింగర్ గా ఖ్యాతి సంపాదించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోక పోవడంతో అదే సోషల్ మీడియా ట్రోలింగ్ కు లక్ష్యంగా మారి అంతే వేగంగా కీర్తి మసకబారింది. 


2. 💼 ఉద్యోగాలు – ఉపాధికి మార్గం

  • డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటి కొత్త ఉద్యోగ రంగాలు ఏర్పడ్డాయి.

  • Influencer Marketing ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్న యువత.


3. 🏃‍♂️ సామాజిక ఉద్యమాలు – ప్రజల శక్తి

  • సోషల్ మీడియా ద్వారా సామాజిక సమస్యలు వెలుగులోకి రావడం, ఉద్యమాలు ప్రారంభమవడం చూస్తున్నాం.

  • #MeToo, #JusticeForVictims వంటి హ్యాష్‌ట్యాగ్ ఉద్యమాలు దీనికి ఉదాహరణలు.


4.  సాంస్కృతిక, భాషా పరిరక్షణ

స్వదేశీ భాషలు, సంప్రదాయాలు, పాత పాటలు, నాటకాలు మొదలైన వాటిని యువతకు పరిచయం చేయడంలో సహాయపడుతోంది.


👎 సోషల్ మీడియా చీకటి కోణం  – Negative Side of Social Media

1.  సమయ నష్టం

సోషల్ మీడియాలో గంటల తరబడి విపరీతంగా టైం పాస్ చేయడం వలన వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి నష్టం కలుగుతోంది.


2.  ఆత్మనింద, డిప్రెషన్

ఇతరుల పోస్టులు ఆదరణ, ఆమోదం చూసి తమను తాము తక్కువగా ఫీల్ అవడం, డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఉదాహరణ: ఒక యువతి తనకు సోషల్ మీడియా లో అతి తక్కువ సంఖ్యలో  ఫాలోవర్లు ఉన్నారనే కారణంతో మానసికంగా బాధపడింది.


3. 📲 ఫేక్ న్యూస్ మాఫియా

తప్పు సమాచారం వేగంగా వ్యాప్తి చెయ్యబడుతున్నది. వార్తా కథనాల ప్రసారంలో తగిన పర్యవేక్షణ కొరవడడం, విపరీత స్వేచ్చ కొన్నిసార్లు ఇది సామాజిక అశాంతికి దారితీస్తోంది.


4. సైబర్ నేరాలు – ప్రమాదకరం

సోషల్ మీడియా ద్వారానే వ్యక్తిగత డేటా దొంగిలింపు, ఫేక్ ప్రొఫైల్స్, చెత్త ఫోటోలు షేర్ చేయడం వంటి నేరాలు పెరుగుతున్నాయి.


5.  పిల్లల భవిష్యత్తుపై ప్రభావం

నేటి పిల్లలు, టీనేజర్లు చదువును వారి భవిష్యత్ ను ఉజ్వలం చేసే ఉద్యోగ, ఉపాధి అవకాసాలను నిర్లక్ష్యం చేస్తూ    సోషల్ మీడియాపై ఎక్కువ సమయం గడిపే దిశగా వెళ్తున్నారు.


👦👧 యువతపై విస్తృత  ప్రభావం – A Closer Look

📌 "అనుసరణతో తిప్పలు " – Influencer Pressures

అధిక శాతం  యువత Instagram/Facebook/YouTube లో విపరీతంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను అనుసరిస్తూ వారిలా మారాలనుకుంటున్నారు. ఇది వారి స్వభావాన్ని, ప్రామాణికతను నాశనం చేస్తోంది. ఒకరిని స్ఫూర్తిగా తీసుకోవడంలో ఎటువంటి ఆక్షేపణ ఉండకపోగా అది ఒక చక్కని ప్రోత్సహపురిత వ్యక్తిత్వాన్ని అందిస్తుంది. ఒకరిని అనుకరించాలని ప్రయత్నించడమే పక్కదారి పట్టిస్తుంది. స్వతహాగా ఆలోచించే శక్తిని, ప్రాతిభా నైపుణ్యాలను నిరోధిస్తుంది. అనుసరణ ఎన్నటికీ ఆమోదం పొందదు, ఒకవేళ ఆమోదం పొందినా అది తాత్కాలిక సంతృప్తి మాత్రమే. తద్వారా ఇతరుల విజయం, జీవనశైలి తో పోల్చుకొని క్రుంగుబాటు, నిరాశ నిస్పృహల తో సతమతం అవుతున్న వారు కూడా అధికం అవుతున్నారు.


📌 "లైక్స్ కోసం పోటీ"

సమాజంలో 'Like Anxiety' అనే పదం సోషల్ మీడియా పుణ్యంగా  ఇప్పుడే అందరికి సుపరిచితం అయింది. వ్యక్తిగత విలువలను కంటే, సోషల్ మీడియా స్పందనలపై ఆధారపడుతున్న యువత తలదించుకునే స్థితికి వచ్చారు. తమ ప్రతిభా పాటవాలు, ఆలోచనలు తగిన గుర్తింపుకు నోచుకోవడం లేదని మానసిక వేదనకు గురవుతున్నారు.



 Social Media వినియోగంలో కొన్ని వ్యక్తిగత నిబంధనలు  తప్పనిసరి 

✔️ సమయ పరిమితి విధించుకోండి

ప్రతిరోజూ 1 గంటకు మించి సోషల్ మీడియా వినియోగించవద్దని నిర్ణయించుకోండి.

✔️ పాజిటివ్ కంటెంట్‌ను ఎంచుకోండి

మీకు విజ్ఞానం, స్ఫూర్తి కలిగించే వీడియోలు, పోస్టులు మాత్రమే చూడండి.

✔️ ప్రైవసీ ప్యారామీటర్లు సెట్ చేయండి

మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు ఎవరికీ కనిపించకూడదనుకుంటే ప్రైవసీ సెట్టింగ్స్ సరిగ్గా పెట్టుకోండి.

✔️ అవగాహన కలిగించండి – పిల్లలపై స్పెషల్ ఫోకస్

పిల్లలకు సోషల్ మీడియా ప్రమాదాల గురించి చెప్పడం, అవసరం అనుకున్నప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పడం అవసరం. పెద్దల పర్యవేక్షణ లేకుండా సోషల్ మీడియా వియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలి.


📝 సోషల్ మీడియా ( Social Media) వినియోగంలో విచక్షణ ఎంతో  అవసరం

సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనం. దీన్ని మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే విజయం మనదే. కేవలం వినోదం కోసమో, కాలక్షేపం కోసమో అలవాటు చేసుకుంటే మాత్రం అనుకోని ఆపదలకు ఆహ్వానం పలికినట్టే. సోషల్ మీడియా అతి వినియోగం శారీరక, మానసిక రుగ్మతలను కలిగించడంతో పాటుగా సామాజిక హోదాను కూడా దిగజార్చే ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియా దుష్ప్రభావాలు వైవాహిక  సంబంధాలను సైతం విచ్చిన్నం చేస్తూ..కుటుంబాల పరువు మర్యాదలను రచ్చకు ఈడుస్తున్న ఘటనలు కోకొల్లలు. సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలను నిరంతరం మననం చేసుకుంటూ..పరిమితిలో,  అవసరార్ధం వినియోగిస్తూ.. జీవితాలను, సమాజాన్ని అభివృద్ధి పథంలో పయనించే ప్రయోజనంలో భాగస్వామిని చేద్దాం. 

సంక్షిప్తంగా చెప్పాలంటే – “Social Media is a good servant but a bad master.”



  • సోషల్ మీడియా మరియు మానసిక ఆరోగ్యం 

  • Influencer Marketing ప్రభావం

  • Cyber Crime & Digital Safety

  • యువతలో సోషల్ మీడియా అడిక్షన్

  • సోషల్ మీడియా వలన పరివర్తన చెందిన జీవనశైలి