🔥Power Star లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
🔥Power Star లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జులై 2025, బుధవారం

Harihara Veeramallu Trailer Release : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రేపు… పవన్ కల్యాణ్ ఎమోషనల్

 

                                                           
Harihara Veeramallu Trailer Release

Harihara Veeramallu Trailer Release : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది పండుగ వార్త. ఎన్నాళ్ళుగానో పవర్ స్టార్ పవన్ అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు  ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ వచ్చేసింది. చారిత్రక నేపథ్యంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్ వీక్షించిన పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్‌ను చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కనిపించారు. ట్రైలర్‌లోని హై ఓల్టేజ్ సన్నివేశాలు చూసిన పవన్ కల్యాణ్ చిన్న పిల్లవాడిలా ఉత్సాహంతో నిండిపోయారు.

జ్యోతికృష్ణకు పవన్ హృదయపూర్వక అభినందన

వీడియో చివర్లో దర్శకుడు జ్యోతికృష్ణ వద్దకు వెళ్లిన పవన్, ‘చాలా కష్టపడ్డావ్’ అంటూ ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు. పవన్ కళ్యాణ్ యొక్క ఈ ఎమోషనల్ మూవ్మెంట్  అభిమానుల గుండెలను తాకకుండా ఉండదు. నిర్మాణ సంస్థ కూడా, “తుపాను వెనక ఉండే శక్తి... ట్రైలర్ చూసిన  పవన్ కూడా తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయారు” అని పేర్కొంది.

స్టార్ కాస్ట్, భారీ నిర్మాణం

మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని, ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సునీల్, నాజర్  వంటి బడా నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

రెండు భాగాలుగా విడుదల

ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  మొదటి భాగానికి ‘హరిహర వీరమల్లు: పార్ట్‌ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో బలమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ ప్రేక్షకుల ఆశలను ఎన్ని రెట్లు పెంచుతుందో చూడాలి.

14, మే 2025, బుధవారం

🔥Power Star Pawan Kalyan OG : 'ఓజీ' సెట్స్‌లో పవన్ కల్యాణ్ గర్జన! – ఫ్యాన్స్‌కి పండగే పండగ! 🎬💥

 

                                                             
🔥Power Star Pawan Kalyan - పవన్ కల్యాణ్

Power Star Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ మళ్లీ వేగం పుంజుకుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ బుధవారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నారన్న వార్త ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం అధికారికంగా వెల్లడించడంతో సోషల్ మీడియా అంతా పవన్ అభిమానుల సందడితో హోరెత్తిపోతుంది. 

"అసలైన ఓజీ సెట్‌లోకి అడుగుపెట్టారు" – అంటూ మూవీ  పీఆర్ టీమ్ విడుదల చేసిన ప్రకటనతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి!

 

🎥 పవన్ కల్యాణ్ ఫుల్ స్వింగ్‌లో… ‘ఓజీ’ టార్గెట్ క్లైమాక్స్!

‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసిన పవన్, ఇప్పుడు పూర్తిగా ‘ఓజీ’ మీదే ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మిగిలిన నటీనటుల వంతు  చిత్రీకరణ పూర్తవ్వగా, ఇప్పుడు పవన్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలతో సినిమా తుది దశకు చేరుకుంది.

దర్శకుడు సుజీత్ మరియు నిర్మాత డీవీవీ దానయ్య చిత్రీకరణను ఓ షెడ్యూల్‌లోనే ముగించేందుకు ఫుల్ ప్లాన్‌తో ఉన్నారు. పవన్ డేట్స్ లభించడంతో సినిమా షూటింగ్ మళ్లీ స్పీడ్ గేర్‌లోకి వెళ్లిపోయింది.


🌟 స్టార్స్ & స్టైల్ – ఓజీ కాస్టింగ్ హై వోల్టేజ్‌!

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మి పవన్‌కు టఫ్ పోజిషన్ ఇవ్వనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


💣 ముంబయి మాఫియా vs మాస్ గ్యాంగ్‌స్టర్ పవన్ – రచ్చ రంజాన్‌ మినిమమ్ గ్యారంటీ!

ముంబయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ ఒక పవర్‌ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నాడు. కేరెక్టర్ ఐజేషన్  లో  బ్లడ్‌, ఫైర్‌, డైలాగ్‌, డ్యాన్స్ అన్నీ ఉండబోతున్నాయంటూ చిత్ర వర్గాల టాక్.

పవన్ ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్ మసాలా అన్నీ ఓజీలో ఉండబోతున్నాయి!