8, జులై 2025, మంగళవారం

Ind vs Eng 2nd Test 2025 : ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ చారిత్రక విజయం…ఇంగ్లాండ్‌పై 336 పరుగుల గ్రాండ్ విక్టరీ

 

Ind vs Eng 2nd Test 2025


 

ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ శుబ్మన్ గిల్ సారథ్యంలోని  భారత క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్‌పై 336 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా, 58 ఏళ్ల ఎడ్జ్‌బాస్టన్ అడ్డుగోడను  ఛేదించి, ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంలో యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, పేసర్ ఆకాశ్ దీప్ కీలక పాత్రలు పోషించారు.

 

 

 

మ్యాచ్ వివరాలు

 ఈ రెండో టెస్టు మ్యాచ్ జూలై 2 నుంచి 6, 2025 వరకు జరిగింది. టాస్ ఓడిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో అద్భుత డబుల్ సెంచరీ సాధించగా, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు కూడా ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 427/6 స్కోరుతో డిక్లేర్ చేసింది, ఇందులో గిల్ 161 పరుగులతో మరో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లలో గిల్ మొత్తం 430 పరుగులు చేసి, ఒక టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించాడు. సిరాజ్ 6 వికెట్లు, ఆకాష్ దీప 4 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ కావడం జరిగింది.  

 

ఇంగ్లాండ్‌ ముందు  608 పరుగులు భారీ లక్ష్యం

ఇంగ్లాండ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేస్ చేయాల్సి వచ్చింది. అయితే, భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులకే ఆలౌట్ అయింది. ఆకాశ్ దీప్ 6/99 తో రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి, మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు (10/187) సాధించాడు. ఇది ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఆకాశ్ దీప్‌ను నిలిపింది, చేతన్ శర్మ (1986) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ ఆకాశ్. మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

 

 

 

ఆకాశ్ దీప్: హీరో ఆఫ్ ది మ్యాచ్

జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకున్ననేపథ్యంలో  ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ తన సత్తా చాటాడు. బీహార్‌లోని ససారామ్ నుంచి వచ్చిన ఈ యువ పేసర్, తన తొలి 10 వికెట్ల హాల్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, ఆకాశ్ దీప్ తన సోదరికి క్యాన్సర్‌తో బాధపడుతున్నందున ఈ విజయాన్ని ఆమెకు అంకితం ఇస్తున్నట్లు భావోద్వేగంతో చెప్పాడు.శుభ్‌మన్ గిల్ నాయకత్వంయువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన రెండో టెస్టు మ్యాచ్‌లోనే అద్భుత నాయకత్వం చూపాడు. అతని 430 పరుగులు టెస్టు చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, విజయాన్ని సీల్ చేసిన క్యాచ్‌ను కూడా గిల్ తీసుకున్నాడు, ఇది అతని నాయకత్వ పరాక్రమాన్ని మరింత హైలైట్ చేసింది.

 

 

 

విరాట్ కోహ్లీ ప్రశంసలు

 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విజయంపై స్పందిస్తూ, జట్టు యొక్క నిర్భీత వైఖరి మరియు ఇంగ్లాండ్‌ను నిరంతరం ఒత్తిడిలో ఉంచిన తీరును ప్రశంసించారు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇది గొప్ప విజయం. భయం లేకుండా ఇంగ్లాండ్‌ను గెలిపించిన జట్టుఅని టీమిండియా యొక్క ధైర్యం మరియు నిరంతర కృషిని  కోహ్లీ అభినందించాడు.

 

 

ఎడ్జ్‌బాస్టన్ గోడలు రికార్డ్ లతో  బద్దలు

 ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు, 1967 నుంచి 8 పరాజయాలు, 7 డ్రాలు ఎదుర్కొంది. ఈ 58 ఏళ్ల అడ్డుగోడను  భారత్ ఈ మ్యాచ్‌లో బద్దలు కొట్టింది, ఇది విదేశీ గడ్డపై భారత్ యొక్క అతిపెద్ద టెస్టు విజయం కావడం విశేషం.


 

 

సిరీస్ స్థితి

ఈ విజయంతో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ 1-1తో సమం అయింది. మూడో టెస్టు గురువారం లార్డ్స్ లో ప్రారంభం కానుంది, ఇక్కడ భారత్ ఈ ఊపును కొనసాగించి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

 

 

ముగింపు

 

ఈ చారిత్రక విజయం భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణం. మొదటి టెస్ట్ ఓటమి అనంతరం త్వరితంగా కోలుకున్న శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని  యువ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై ఈ అద్భుత విజయాన్ని సాధించింది, ఇది భవిష్యత్ మ్యాచ్‌లకు ఉత్సాహాన్ని ఇస్తుంది.

 

 

3, జులై 2025, గురువారం

Kurnool Honeymoon Case : కర్నూలు హనీమూన్ హత్యకేసు: భార్య ప్రణయపు ప్రలోభానికి భర్త బలి – ఐదు సార్లు హత్య ప్రయత్నాల నుంచి తప్పించుకున్నా వదలని ప్రాణ గండం

 

                                     
Kurnool Honeymoon Case

Kurnool Honeymoon Case : మేఘాలయలో హనీమూన్ హత్య ( Meghalaya honeymoon murder case) తీవ్ర సంచలనం ఘటన నుండి దేశం కోలుకోకముందే అంతకు మించిన సంచలన ఘటనలు మరిన్ని జరుగుతుండడం ఎంతో ఆందోళనకరం. ఆ క్రూర ఘటనను తలపించే మరో ఘాతుకం కర్నూలు లో చోటు చేసుకోవడం దురదృష్టకరం. 

తెలుగు రాష్ట్రాల ప్రజలను దుర్ఘటనలతో కుదిపేస్తున్న పరిణామాలలో ఇది ఒకటి. ప్రేమ, కపటము, కుట్ర, హత్య – ఇవన్నీ కలిసిన ఈ కథ నిజ జీవితంలోనే జరిగింది. ‘కర్నూల్ హనీమూన్ మర్డర్’ గా గుర్తింపు పొందిన ఈ కేసులో బయటపడుతున్న నిజాలు విన్నవారిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి.

🌑 తేజేస్వర్  కథ – పెళ్లి  నుండి మత్యు మార్గంలో అడుగులు 

జోగులాంబ గద్వాల జిల్లాకి చెందిన తేజేస్వర్  ఒక ప్రైవేట్ ల్యాండ్ సర్వేయర్. మే 18న అతను ఐశ్వర్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ, కేవలం నెలరోజులకే అతని జీవితం ముగిసిపోతుందని ఎవ్వరికీ ఊహ లేకుండా పోయింది. నిశ్చితార్థం కు ముందే చెప్పా పెట్టకుండా అదృశ్యం అయిన ఐశ్వర్య తిరిగి వచ్చి, పెళ్ళికి తన తల్లి ఆర్ధిక ఇబ్బందులు పడడం తట్టుకోలేక వెళ్ళిపోయానన్న ఐశ్వర్య మోసపు మాటలను నమ్మడం తేజేస్వర్ జీవిత ముగింపు ముహూర్తం పలికింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వివాహం వెనుక ఘోర కుట్ర దాగి ఉంది. ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు కలసి తేజేస్వర్ ను హత్య చేయాలని పథకం వేసారు. ₹75,000 రూపాయలు కిల్లర్లకు ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసారు.

🔍 GPS ట్రాకింగ్ – సాంకేతికతను హత్యకు వాడిన ఘోర నాయిక

పూర్తిగా ప్రియుడి మైకంలో మునిగి ఉన్న ఐశ్వర్య  తన భర్త బైక్‌కి GPS ట్రాకర్ అమర్చి, అతని ప్రతి కదలికను కిల్లర్లకు తెలియజేస్తూ ఉండేది. ఐదు సార్లు హత్యకు ప్రయత్నించినా తేజేస్వర్ తనకు తెలియకుండానే  తప్పించుకున్నాడు. చివరికి, భూసర్వే కార్యక్రమం పేరుతో హంతక ముఠా  కర్నూలుకు పిలిపించి, జూన్ 17న కారులోనే గొంతు కోసి హత్య చేసారు.


Also Read : Meghalaya Couple Missing :  మేఘాలయ  హనీమూన్ ట్రాజెడీ: హనీమూన్ ట్రిప్ ని భర్త అంతిమయాత్ర గా మార్చిన భార్య -  దర్యాప్తులో దుమారం!


💔 అనైతిక ప్రణయం  – ఈ హత్య వెనుక అసలు కథ

ఈ కేసు వెనక తిరుమలరావు – ఐశ్వర్యల మధ్య పెళ్ళికి ముందు నుండే అక్ర్రమ సంబంధం  ఉండటం, అలాగే తిరుమలరావు భార్యకు తెలిసినప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు సంసారబంధం, మరొకవైపు ప్రేమలో లోతుగా మునిగిపోవడం, చివరికి కుటుంబాలను కొల్లగొట్టే నిర్ణయం – ఇది సమాజానికి హెచ్చరిక.

🔗 తల్లి సుజాత పాత్ర – ప్రేమకు సహకారమా?

కంచే  చేను మేసిన విధంగా  ఐశ్వర్య జీవితం ఒక తప్పుడు దారిలో  పోవడానికి తల్లి సుజాత ముఖ్య భూమిక పోషించింది. తాను అనైతిక మార్గంలో వెళ్ళడమే కాకుండా తన కుమార్తెను కూడా ఆ రొంపిలోకి దించింది. చివరికి  తేజేస్వర్  హత్యకేసులో ఐశ్వర్య తల్లి సుజాత కూడా ప్రధాన పాత్ర పోషించింది. తిరుమలరావు పనిచేస్తున్న బ్యాంక్  లో స్వీపర్  గా పని చేస్తున్న  సుజాత – అతనితో అనుబంధం పెంచుకోవడం, ఆ తరువాత  కూతురికి పరిచయం చేయడం, చివరికి ఈ ఘోరానికి దారితీసింది.


⚠️ సమాజం కోసం బోధ: ఇలాంటి కుట్రలు ఎందుకు?

మన సమాజంలో:

  • ప్రేమ – పెళ్లి మధ్య స్పష్టత లేకపోవడం

  • ఆర్థిక సమస్యలు

  • ఇంటర్నెట్, ఫోన్ల ద్వారా అవాంచిత పరిచయాలు, సంబంధాలు  పెరగడం

  • సాంప్రదాయాలు, కట్టుబాట్ల ను అనుసరించడం నేటి తరంలో ఎక్కువ మంది మూర్ఖత్వం గా భావిస్తుండడం 

 ఇలాంటి సంఘటనలకు మూలకారణాలు అవుతున్నాయి.


Also Read : Odisha Murder : పెంచిన తల్లినే కడతేర్చిన పెంపుడు  కూతురు: ఒడిశాలోని దారుణ హత్య వెనుక చీకటి నిజాలు


🔥 ‘హనీమూన్ మర్డర్’ – దేశవ్యాప్తంగా కలకలం

ఈ కేసు Meghalaya honeymoon murder case ను గుర్తుకు తెస్తుంది. ఆ కేసులో Sonam తన భర్తను హత్య చేయడానికి ప్రియుడు Raj Kushwaha తో కలసి కిల్లర్లను అద్దెకు తీసుకుంది. ఇలాంటి కేసులు పెరుగుతుండటం భయంకర సంకేతం.


🧠 మానసిక శాస్త్రపరంగా – హత్యకు దారితీసే ప్రేమ

మనసు లోతుల్లోకి వెళ్లితే,

  1. Obsessive Love Disorder (ప్రేమ పట్ల అసహ్యకరమైన ఆసక్తి)

  2. Narcissistic Personality Traits (తన అవసరాలకే ప్రాధాన్యం)

  3. Sociopathy or Psychopathy Elements (ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా దాడులు)

ఇలాంటి లక్షణాలు కలవారే ఈ తరహా హత్యలకు పాల్పడతారు. సైకాలజిస్టులు  చెబుతున్న ప్రకారం, ఇలాంటి కేసుల్లో early counselling intervention ఉంటే ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది..


📌 కేసు తాలూకు వివరాలు

వివరముసూచన
మృతుడుటేజేశ్వర్ ( జోగులాంబ జిల్లా , తెలంగాణా )
హత్యకు కారణంభార్య అక్రమ సంబంధం 
హత్యకు సహకారులుభార్య, ప్రియుడు, తల్లి, కిల్లర్లు, డ్రైవర్
హత్య పద్ధతిగొంతు కోసి, కాలువ లో పడేయడం


🔦 పోలీసుల చాకచక్యం

ఈ కేసు పరిష్కారానికి గద్వాల పోలీసులు, కర్నూలు పోలీసులు సమన్వయం, Call Data Records (CDR) analysis, GPS tracking history, Bank transactions verification కీలకం అయ్యాయి.


✨ సంక్షోభం 

ఈ కేసు ప్రేమ, లోభం, కుట్ర, హత్య అనే నాలుగు పదాల చుట్టూ తిరుగుతుంది. సాంకేతిక సహాయం, అనైతిక కుటుంబ సమీకరణం, స్వార్థం, మానసిక సమస్యలు – ఇవన్నీ కలిసినప్పుడు ఒక జీవితాన్ని ఎలాంటి విధంగా కూల్చివేయవచ్చో దీని ద్వారా తెలుస్తుంది.



💡 ముగింపు – సమాజానికి పాఠం


ఇటువంటి అవాంచిత ఘటనలు సమాజంలో రేకెత్తిస్తున్న ప్రశ్నలు ఎన్నో. పెళ్ళికి ముందు ప్రణయమే తప్పు. మరొకరితో పెళ్ళికి అంగీకరించడం మరో తప్పు. దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తరువాత సైతం కొనసాగించడం అన్నింటికంటే పెద్ద తప్పు. ఆ అనైతిక పయనంలో చేసే ఆలోచనలు, పనుల వలన ఎన్నో జీవితాలకు ముప్పు.  తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పుడు మార్గంలో పయనించకుండా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం అన్నది సర్వ సాధారణం. ఇక్కడ మాత్రం ఆ కన్నతల్లి నే తన కూతురిని తప్పుడు మార్గంలో చేయిపట్ట్టి నడిపించడం విషాదం. 
  • పెళ్లికి ముందే సరిగా తెలుసుకోవాలి.

  • ఎంతటి ప్రేమనైనా తప్పు చేయకూడదు.

  • ఇలాంటి అనైతిక సంబంధాలు చివరికి హత్యలకు దారితీస్తాయి.

  • అవిశ్వాసం, అనైతికం, కుట్రకు చోటు ఇవ్వకండి.




People Also Ask

  1. కర్నూల్ హనీమూన్ మర్డర్‌లో ఎంతమంది అరెస్ట్ అయ్యారు?
    మొత్తం 8 మంది.  భార్య, ప్రియుడు, తల్లి, కిల్లర్లు, డ్రైవర్.

  2. హనీమూన్ మర్డర్ కేసు ఎందుకు ఫేమస్ అయ్యింది?
    భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడం, 5  హత్య ప్రయత్నాలు  నుంచి అతను తప్పించుకోవడం, కన్నతల్లి నే కుమార్తెను    ఇచ్చింది.

  3. ఇలాంటి హత్యలకు ప్రధాన కారణాలు ఏమిటి?
    అక్రమ సంబంధాలు, స్వార్థ, ఆర్ధిక ప్రయోజనాలు, విచ్చలవిడితనం, మితిమీరిన స్వేచ్చ

  4. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు వివరాలు ఏమిటి?
    సొనమ్ అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హనీమూన్ లో హత్య చేయించిన కేసు.

2, జులై 2025, బుధవారం

Harihara Veeramallu Trailer Release : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రేపు… పవన్ కల్యాణ్ ఎమోషనల్

 

                                                           
Harihara Veeramallu Trailer Release

Harihara Veeramallu Trailer Release : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది పండుగ వార్త. ఎన్నాళ్ళుగానో పవర్ స్టార్ పవన్ అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు  ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ వచ్చేసింది. చారిత్రక నేపథ్యంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్ వీక్షించిన పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్‌ను చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కనిపించారు. ట్రైలర్‌లోని హై ఓల్టేజ్ సన్నివేశాలు చూసిన పవన్ కల్యాణ్ చిన్న పిల్లవాడిలా ఉత్సాహంతో నిండిపోయారు.

జ్యోతికృష్ణకు పవన్ హృదయపూర్వక అభినందన

వీడియో చివర్లో దర్శకుడు జ్యోతికృష్ణ వద్దకు వెళ్లిన పవన్, ‘చాలా కష్టపడ్డావ్’ అంటూ ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు. పవన్ కళ్యాణ్ యొక్క ఈ ఎమోషనల్ మూవ్మెంట్  అభిమానుల గుండెలను తాకకుండా ఉండదు. నిర్మాణ సంస్థ కూడా, “తుపాను వెనక ఉండే శక్తి... ట్రైలర్ చూసిన  పవన్ కూడా తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయారు” అని పేర్కొంది.

స్టార్ కాస్ట్, భారీ నిర్మాణం

మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని, ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సునీల్, నాజర్  వంటి బడా నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

రెండు భాగాలుగా విడుదల

ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  మొదటి భాగానికి ‘హరిహర వీరమల్లు: పార్ట్‌ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో బలమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ ప్రేక్షకుల ఆశలను ఎన్ని రెట్లు పెంచుతుందో చూడాలి.

20, జూన్ 2025, శుక్రవారం

Top 10 Intelligence Agencies In The World : ప్రపంచంలో టాప్ 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు – అత్యంత విస్వసనీయ, శక్తివంత వ్యస్థలు

 

                                   
Top 10 Intelligence Agencies In The World : ప్రపంచంలో టాప్ 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు

అత్యంత వేగవంతమైన సాంకేతిక అభివృద్దితో  ప్రపంచ గమనం కూడా ఎన్నో మార్పులకు లోనవుతుంది. పోటీ తత్వం, ఆధిపత్య ధోరణులతో దేశాల మధ్య సంబంధాలు సైతం తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. స్వతః సిద్ద ఎదుగుదలకు ప్రాముఖ్యత ఇవ్వడం కంటే ఇరుగు, పొరుగు దేశాలలో అశాంతి, అలజడులను ప్రోత్సహించడం ద్వారా లబ్ది పొందాలనే విపరీతధోరణులు  అంతకంతకు పెచ్చరిల్లుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు అన్న తేడా లేకుండా  అన్ని దేశాలు తమ అంతర్గత, బాహ్య రక్షణకు  విశేష ప్రాధాన్యత ఇస్తుంటాయి. 


సాధారణంగా ఏ దేశంలో అయినా అంతర్గత భద్రతను, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వివిధ పోలీస్మా విభాగాలు ఉంటాయి. అదే విధంగా సరిహద్దు భద్రతకు ఆర్మీ బాధ్యత వహిస్తుంది. ఇవి సాధారణంగా యూనిఫాం, నిర్దిష్ట క్రమశిక్షణ, విధి విధానాలు కలిగి  ఉండి క్షేత్రస్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన విభాగాలు. ఈ రెండు భద్రతా వ్యవస్థలు కాకుండా మరో ముఖ్యమైన వ్యవస్థ ఎటువంటి బాహ్య గుర్తింపు లేకుండా నిరంతరం పని చేస్తూ ఉంటుంది. అదే రహస్య నిఘా వ్యవస్థ  (Intelligence Agencies) లేదా రహస్య సమాచార సేకరణ వ్యవస్థ. 


ఇది  ఒకనాటి రాజుల పాలనలో ఉన్న గూడచార వ్యవస్థకు ఆధునిక రూపం.  ఇవి దేశంలోనూ, విదేశాలలోనూ తమ దేశ భద్రత, సమగ్రతకు వ్యతిరేకంగా పని చేసే, ప్రణాళికలు రచించి అమలు చేసే  అరాచక శక్తుల నడవడికపై  రహస్య పంథాలో నిరంతర నిఘా వేసి ఉంటాయి. వారు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆ అరాచక శక్తులను అడ్డుకోవడం, వారి ప్రయత్నాలను ముందుగానే గుర్తించి విఫలం చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థలు ఏ దేశానికైనా గుండెకాయ వంటివే.   


మానవుల భద్రత, దేశ రక్షణ, అంతర్జాతీయ సంబంధాల లోతైన విశ్లేషణ, శత్రు దేశాల దుష్ప్రయత్నాల అరికట్టడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించే గూఢచార సంస్థలు (Intelligence Agencies) ప్రపంచ దేశాల వెన్నెముకలుగా నిలుస్తున్నాయి. ఈ బ్లాగ్ ద్వారా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీల గురించి మనం తెలుసుకుందాం.




🔎 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎందుకు ముఖ్యమైనవి?

  • దేశ భద్రత కోసం రహస్య సమాచారం సేకరణ

  • ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడం

  • ఇతర దేశాల రాజకీయ, ఆర్థిక వ్యూహాలను గమనించడం

  • సైబర్ యుద్ధం, స్పై వేర్ చర్యలకు వ్యతిరేకంగా రక్షణ

  • యుద్ధ సమయంలో కీలక వ్యూహాత్మక సమాచారం పొందడం


ప్రపంచంలో టాప్ 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు

1. CIA – Central Intelligence Agency (USA)

స్థాపన సంవత్సరం: 1947
ప్రధాన కార్యాలయం: లాంగ్లీ, వర్జీనియా
ప్రధాన కార్యాచరణ:


  • అమెరికా విదేశాంగ విధానానికి అనుగుణంగా సమాచార సేకరణ

  • శత్రు దేశాలలో మారణశక్తి గల ఆపరేషన్లు

  • టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, అంతర్జాతీయ నేరగాళ్లపై నిఘా


గుర్తుపెట్టదగ్గ విషయం:
CIA ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ నెట్‌వర్క్ కలిగి ఉంది. ఒసామా బిన్ లాడెన్ (Osama Bin Laden ) వంటి కరడుగట్టిన అంతర్జాతీయ టెర్రరిస్ట్ తోపాటుగా ఎంతో మంది అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అమెరికా అంతమొందించడంలో వీరి పాత్ర ఎంతో కీలకం.   వీరి కార్యాచరణ లోపలికి జులియన్అస్సాంజ్ (WikiLeaks) వంటి ఘటనల ద్వారా ఎంతో చర్చకు దారితీసింది.


2. Mossad (ఇస్రాయెల్)

స్థాపన సంవత్సరం: 1949
ప్రధాన కార్యాలయం: టెల్ అవివ్


విశేషతలు:

  • ప్రపంచంలోని అత్యంత భీకరమైన, అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా ప్రసిద్ధి

  • మ్యూనిచ్ ఒలింపిక్స్ లో హత్య చేసిన ఇజ్రాయెల్ క్రీడాకారులపై ప్రతీకార చర్యలు చేపట్టిన Mossad రికార్డ్‌ బ్రేకింగ్ ఆపరేషన్ గా గుర్తింపు పొందింది


విశేష రహస్యమైన విధానం:
ఇస్రాయెల్ పై ఎటువంటి ఉగ్రవాద ముప్పు ఉన్నా, ముందుగానే స్పందించే శక్తి వారి ప్రత్యేకత



3. RAW – Research and Analysis Wing (భారత్)

స్థాపన సంవత్సరం: 1968
ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ


కార్యాచరణ:

  • విదేశాలలో భారత ప్రయోజనాల పరిరక్షణ

  • పాకిస్తాన్, చైనా వంటి ప్రత్యర్ధి దేశాల నుంచి వచ్చే ముప్పులను గుర్తించడం, నిరంతర నిఘా..దేశంలో మావోయిస్ట్, టెర్రరిస్ట్ కార్యకలాపాలపై రహస్య సమాచార సేకరణ 

  • దేశ రక్షణ, దౌత్య వ్యూహాలు రూపొందించడంలో కీలకపాత్ర


గమనించదగిన అంశం:
ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో RAW ఇచ్చిన సమాచారమే భారత విజయంలో కీలకంగా నిలిచింది.


4. FSB – Federal Security Service (రష్యా)

స్థాపన సంవత్సరం: 1995 (KGB తరువాత)
ప్రధాన కార్యాలయం: మాస్కో
ప్రధాన విధులు:

  • దేశవిద్రోహ శక్తులపై గట్టి నిఘా

  • ఇంటర్నల్ సెక్యూరిటీ

  • సైబర్ వార్, టెర్రరిజం నియంత్రణ

రహస్యతలో వేరే లెవెల్:
FSB రష్యా అధ్యక్షుల ఆదేశాలకే పని చేస్తుంది. వీరి పూర్వసంస్థ KGB ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థగా పేరొందింది.


5. MI6 – Secret Intelligence Service (యునైటెడ్ కింగ్‌డమ్)

స్థాపన సంవత్సరం: 1909
ప్రధాన కార్యాలయం: లండన్
ప్రధాన కార్యకలాపాలు:

  • విదేశాల్లో బ్రిటన్ ప్రయోజనాల కోసం సమాచార సేకరణ

  • టెర్రరిజం, విప్లవ శక్తులపై నిఘా

  • బ్రిటిష్ పౌరులపై స్పై ముప్పుల నివారణ

ప్రముఖత:
బాండ్ చిత్రాలలో 'M' అనే పాత్రకు ప్రేరణ ఇచ్చిన నిజమైన సంస్థ MI6 గానే. ఇది అత్యంత సాహసోపేత కార్యకలాపాల ద్వారా గుర్తింపు పొందింది.


6. ISI – Inter-Services Intelligence (పాకిస్తాన్)

స్థాపన సంవత్సరం: 1948
ప్రధాన కార్యాలయం: ఇస్లామాబాద్
ప్రధాన విధులు:

  • భారతదేశం మీద గూఢచారి కార్యకలాపాలు

  • అంతర్గత, బహిరంగ రక్షణ వ్యవస్థ

  • అఫ్గానిస్తాన్ మరియు ఇతర శక్తుల మధ్య సంబంధాలపై నిఘా

వివాదాలు:
ISI చాలా సార్లు ఉగ్రవాద సంస్థలతో సంబంధాల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.



7. DGSE – Directorate-General for External Security (ఫ్రాన్స్)

స్థాపన సంవత్సరం: 1982
ప్రధాన కార్యాలయం: పారిస్
విశేషతలు:

  • విదేశీ గూఢచారి సమాచార సేకరణ

  • టెర్రరిజం పై నిరంతర నిఘా

  • ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పని చేసే వ్యక్తులపై రహస్యంగా విచారణ

సాంకేతిక పరిజ్ఞానంలో ఆధునికత:
DGSE అధునాతన సైబర్ యుద్ధ సామర్థ్యం కలిగి ఉంది.


8. MSS – Ministry of State Security (చైనా)

స్థాపన సంవత్సరం: 1983
ప్రధాన కార్యాలయం: బీజింగ్


ప్రధాన బాధ్యతలు:

  • విదేశీ స్పైలు పై నిఘా

  • అంతర్జాతీయ టెక్నాలజీ, పరిశోధనలను చేజిక్కించుకోవడం

  • చైనా ప్రభుత్వ వ్యతిరేక శక్తులను నిరోధించడం

విశేష విషయం:
MSS సైబర్ స్పైయింగ్, హ్యాకింగ్ కార్యకలాపాలలో ప్రపంచస్థాయిలో ఒకటి.


9. ASIS – Australian Secret Intelligence Service (ఆస్ట్రేలియా)

స్థాపన సంవత్సరం: 1952
ప్రధాన కార్యాలయం: కాన్‌బెర్రా


కార్యాచరణ:

  • ఆస్ట్రేలియా ప్రయోజనాల పరిరక్షణ

  • దక్షిణాసియా, పసిఫిక్ ప్రాంతాలలో సమాచార సేకరణ

  • టెర్రరిజం మరియు హ్యుమన్ ట్రాఫికింగ్ పై నిఘా


ప్రత్యేకత:
ASIS కార్యకలాపాలు చాలా రహస్యంగా ఉంటాయి. మీడియాలో ఎక్కువగా ప్రసారం కానప్పటికీ, ఇది సమర్థవంతమైన సంస్థ.


10. BND – Bundesnachrichtendienst (జర్మనీ)

స్థాపన సంవత్సరం: 1956
ప్రధాన కార్యాలయం: బెర్లిన్


ప్రధాన విధులు:

  • అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై విశ్లేషణ

  • యూరప్ లో భద్రతా సమస్యలపై నిఘా

  • దేశవిదేశాలలో జర్మన్ రక్షణ విధానాలపై సమాచారం సేకరణ

టెక్నాలజీ ఆధారిత నిఘా:
BND సైబర్ నిఘాలో ప్రపంచంలో మంచి స్థానం సంపాదించింది.


🔐 ముగింపు: ఇంటెలిజెన్స్ – దేశ రక్షణకు మూల స్తంభం

ప్రపంచంలోని ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తమ  ప్రజల భద్రత, దేశ రక్షణ కోసం నిరంతరం రహస్యంగా పనిచేస్తూ, శత్రు దేశాల ముప్పులను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకుంటుంటాయి. వీటిలో కొన్నింటి కార్యకలాపాలు ప్రజల దృష్టికి రానప్పటికీ, వీరి పాత్ర ఎంతో కీలకం. దేశ రక్షణ అనేది కేవలం సైన్యం పని కాదని, అంతర్దృష్టితో పనిచేసే గూఢచార సంస్థలు కూడా పాత్రధారులని చెప్పాలి.



People Also Ask  ( పాఠకులు తరచుగా అడిగే ప్రశ్నలు ) – FAQ Section (SEO-Friendly)


1.  ప్రపంచంలో అత్యుత్తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏది?

Which is the No. 1 intelligence agency in the world?
👉 సాధారణంగా CIA (Central Intelligence Agency) ను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా పరిగణిస్తారు.


2.  భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరు ఏమిటి?

What is the name of India's intelligence agency?
👉 భారతదేశానికి అత్యంత ప్రాముఖ్యమైన  ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరు RAW (Research and Analysis Wing).


3.  Mossad ఏ దేశానికి చెందింది?

Mossad belongs to which country?
👉 Mossad ఇస్రాయెల్ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.


4.  ISI సంస్థ ఎందుకు వివాదాస్పదంగా ఉంటుంది?

Why is Pakistan's ISI often controversial?
👉 ISI ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు రావడం వల్ల ఎన్నో సార్లు అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంది.


5.  RAW vs ISI – ఏది శక్తివంతమైందని భావిస్తారు?

RAW vs ISI – Which is considered more powerful?
👉 ఇది పరిస్థితి ఆధారంగా మారుతుంది. అయితే RAW మౌనంగా మరియు వ్యూహాత్మకంగా పనిచేస్తూ పలు విజయాలు సాధించింది.


6. ప్రఖ్యాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పుడు స్థాపించబడ్డాయి?

When were these intelligence agencies established?
👉 ఉదాహరణకు, CIA – 1947, RAW – 1968, Mossad – 1949, MI6 – 1909 లో స్థాపించబడ్డాయి.


7. KGB ఇప్పటికీ పనిచేస్తుందా?

Is KGB still active today?
👉 KGB 1991లో రష్యాలో విడిపోగా, ప్రస్తుతం దాని స్థానంలో FSB పనిచేస్తోంది.


8.  ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏ విధంగా పనిచేస్తాయి?

How do intelligence agencies operate globally?
👉 వీటికి తమ దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు విదేశాల్లో స్పై నెట్‌వర్క్‌లు, సైబర్ నిఘా వ్యవస్థలు, భాషా నిపుణులు ఉంటారు.


9.  ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సైబర్ వార్ లో ఎలా పాల్గొంటాయి?

How do intelligence agencies engage in cyber warfare?
👉 ఈ సంస్థలు సైబర్ హ్యాకింగ్, డేటా లీక్, సురక్షిత సమాచార వ్యవస్థలను పరీక్షించడం వంటి చర్యలు చేపడతాయి.


10.  ఇండియన్  ఇంటలిజెన్స్  ఏజెన్సీలకు ఏ విద్యార్హతలు అవసరం?

What qualifications are required to join Indian intelligence agencies?

👉 సాధారణంగా సివిల్ సర్వీసెస్, IBPS లేదా ప్రత్యక్ష నియామకం ద్వారా, సంబంధిత భాషా పరిజ్ఞానం, అనలిటికల్ స్కిల్స్ అవసరం. 

18, జూన్ 2025, బుధవారం

Obesity : ఊబకాయాన్ని ఓడిద్దాం – ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యపై అవగాహన

 

                                                
Obesity : ఊబకాయం

ఊబకాయం లేదా అధిక బరువు  అంటే ఏమిటి?

Obesity : ఊబకాయం అనేది శరీరంలో అధిక కొవ్వు (Fat) నిల్వగా ఉండే ఒక ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ద్వారా నిర్వచించబడుతుంది. BMI 30 కంటే ఎక్కువగా ఉండడం   ఊబకాయంగా పరిగణించబడుతుంది. ఈ స్థితి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది – ముఖ్యంగా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, మరియు కొంతమంది క్యాన్సర్లు కూడా ఇందులోకి వస్తాయి.


ఊబకాయం కారణాలు (Causes of Obesity)

1. శక్తి అసమతుల్యత (Energy Imbalance)

మన శరీరానికి అవసరమైన శక్తికన్నా ఎక్కువ క్యాలొరీలు తీసుకుంటే, అవి కొవ్వుగా నిల్వ అవుతాయి. ఇది ఊబకాయంకు  ప్రధానమైన కారణం.

2. జీవనశైలి కారణాలు (Lifestyle Factors)

  • అధిక జంక్ ఫుడ్ సేవనము

  • వ్యాయామం లేకపోవడం

  •  నిద్ర లేమి

  • ఈ మూడు ప్రధాన అంశాలు శరీర బరువుపై ప్రభావం చూపుతాయి.

3. జన్యుపరమైన ప్రభావం (Genetic Factors)

కొంతమందిలో ఊబకాయం కుటుంబ వారసత్వంగా వస్తుంది. హార్మోన్లలోని మార్పులు, శరీర స్వభావం కూడా ఇందులో భాగస్వాములవుతాయి.

4. పర్యావరణ పరిస్థితులు (Environmental Factors)

అధిక క్యాలరీ కలిగిన ఆహారం సులభంగా అందుబాటులో ఉండటం, వ్యాయామానికి సరైన అవకాశాలు లేకపోవడం కూడా ఊబకాయంకు దోహదపడతాయి.

5. వైద్య సంబంధిత కారణాలు (Medical Conditions)

కొంతమంది వ్యక్తులు ప్రత్యేకమైన వైద్య పరిస్థితుల వల్ల ఊబకాయంగా మారుతారు. ఉదాహరణకు – ప్రాడర్-విల్లీ సిండ్రోమ్ (Prader-Willi Syndrome), కొంత మందికి ఉపయోగించే మందులు కూడా బరువు పెరిగేలా చేస్తాయి.


ఊబకాయంతో వచ్చే ఆరోగ్య సమస్యలు (Health Risks Associated with Obesity)

1. గుండె సంబంధిత వ్యాధులు (Cardiovascular Diseases)

ఊబకాయం గుండె జబ్బులు, బీపీ, మరియు స్ట్రోక్ వంటి సమస్యలకు కారణమవుతుంది. అధిక కొవ్వు శరీర రక్తనాళాల్లో కొవ్వు చారలు ఏర్పడేలా చేసి రక్తప్రసరణను అడ్డుకుంటుంది.

2. టైప్ 2 డయాబెటిస్

ఊబకాయం ఉన్న వ్యక్తులకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. శరీరంలోని ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.

3. కొన్ని రకాల క్యాన్సర్లు (Certain Cancers)

మహిళల్లో బ్రెస్ట్  మరియు యుటరైన్ క్యాన్సర్, పురుషులలో కాలన్ క్యాన్సర్ వంటి క్యాన్సర్లకు ఊబకాయం ప్రధాన కారకంగా ఉంటుంది.

4. నిద్రలో శ్వాస ఆగిపోవడం – స్లీప్ అప్నియా (Sleep Apnea)

ఊబకాయంతో ఉండేవారు ఎక్కువగా నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇది గుండెపోటుకు కూడా దారితీయవచ్చు.

5. ఆస్టియోఆర్థరైటిస్ (Osteoarthritis)

శరీర బరువు పెరిగినప్పుడు మోకాళ్లు, కాళ్లు వంటి జాయింట్స్‌పై అధిక ఒత్తిడి వస్తుంది. ఇది నొప్పులు, కీళ్ల వాపులు, ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది.


ఊబకాయం నివారణ మరియు చికిత్స (Management of Obesity)

1. జీవనశైలి మార్పులు (Lifestyle Changes)

  • ఆహార నియంత్రణ: తక్కువ క్యాలొరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా పచ్చి కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

  • వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు brisk walking లేదా ఇతర శారీరక వ్యాయామాలు చేయాలి.

  • వైఖరి మార్పు: ఒత్తిడి తగ్గించుకునే పద్ధతులు (meditation, yoga) ఉపయోగించాలి.

2. మందులు (Medications)

కొన్ని సందర్భాలలో డాక్టర్ల సలహా మేరకు బరువు తగ్గించే మందులు వాడవచ్చు. ఇవి స్వతంత్రంగా కాకుండా జీవనశైలి మార్పులతో పాటు ఉండాలి.

3. శస్త్రచికిత్స (Bariatric Surgery)

తీవ్రమైన ఊబకాయం ఉన్నవారికి శస్త్రచికిత్స (జీర్ణాశయ పరిమాణం తగ్గించే సర్జరీలు) ద్వారా బరువు తగ్గించవచ్చు. కానీ ఇవి చివరి ఎంపికగా మాత్రమే పరిగణించాలి. ఇది అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన ప్రక్రియ.


ఊబకాయం – సామాజిక ప్రభావం (Social & Psychological Effects)

  • మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

  • కొంతమంది ఊబకాయం కారణంగా వ్యంగ్యాలను ఎదుర్కొంటారు.

  • తక్కువ ఆత్మవిశ్వాసం, ఒంటరితనం వంటి భావోద్వేగ సమస్యలు ఎదురవుతాయి.


ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకాలు (Tips for a Healthy Weight)

  • ప్రతి రోజు సమయానికి తినడం

  • హై షుగర్, హై ఫాట్ ఫుడ్‌లకు దూరంగా ఉండడం

  • నీటిని అధికంగా తీసుకోవడం

  • ప్రతి 2 గంటలకు కొద్దిగా తినడం (portion control)

  • స్మార్ట్ ఫోన్, టీవీ ముందు తినే అలవాట్లను తగ్గించడం

  • రాత్రి 8 గంటలకు ముందే భోజనం ముగించడం 

  • ఫాస్ట్ ఫుడ్స్ , బయటి తిండికి దూరంగా ఉండడం 


ముగింపు (Conclusion)

Obesity : ఊబకాయం అనేది చిన్న, పెద్ద, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరిలోనూ అధికంగా ప్రభావం చూపుతున్న అనారోగ్యం.  ఇద పైకి  ఒక సాధారణమైన సమస్యగా కనిపిస్తుందన్న కారణంగా , దీనిని తేలికగా  తీసుకోవడం ప్రమాదకరం. ఇది అనేక రకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఊబకాయం ను నివారించడంలో శ్రద్ధ, క్రమశిక్షణ, సరైన ఆహారం, వ్యాయామం, డాక్టర్ సలహా వంటి విషయాలు కీలకంగా మారతాయి. మన శరీర ఆకృతిలో చిన్నగా మార్పు, పెరుగుదల గోచరించినపుడే తగిన శారీరక, ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా ఈ ఊబకాయం సమస్యను సమర్థవంతంగా నిరోధించగలం.  అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావడమే కాకుండా శస్త్ర చికిత్స కు సైతం సిద్దపడ వలసి ఉంటుంది. శరీర ఆరోగ్యంపట్ల నిరంతర అప్రమత్తత, అవగాహనే మనకు రక్ష ...!



ప్రజలు ఎక్కువగా అడిగే ప్రశ్నలు (People Also Ask)

1. ఊబకాయంను సహజంగా ఎలా తగ్గించుకోవచ్చు?

సహజంగా ఊబకాయం తగ్గించడానికి అధిక నీటి సేవనం, ప్రతి రోజు వ్యాయామం, తక్కువ క్యాలొరీలు కలిగిన ఆహారం తీసుకోవడం, తినే పద్ధతులను క్రమబద్ధీకరించడం అవసరం. ఆయుర్వేదం, యోగా వంటి ప్రకృతి చికిత్సలు కూడా సహాయపడతాయి.

2. BMI అంటే ఏమిటి? ఊబకాయంతో దాని సంబంధం ఏమిటి?

BMI (Body Mass Index) అనేది వ్యక్తి బరువు మరియు ఎత్తు ఆధారంగా ఆయన స్థితిని అంచనా వేసే పద్ధతి. BMI 25–29.9 అంటే అధిక బరువు, 30కి పైగా అంటే మోటాపు.

3. ఊబకాయం వల్ల వచ్చే ప్రాథమిక ఆరోగ్య సమస్యలు ఏమిటి?

ముఖ్యంగా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, నిద్రలో శ్వాస ఆగిపోవడం (స్లీప్ అప్నియా), కీళ్ల నొప్పులు మరియు కొంతమంది క్యాన్సర్లు ఊబకాయంతో సంభవిస్తాయి.

4. పిల్లలలో ఊబకాయం ఎలా నియంత్రించాలి?

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం, టీవీ/మొబైల్ ముందు ఎక్కువ సమయం గడపకుండా చూడడం, ఆటల ద్వారా శారీరక కదలికలు పెంచడం ముఖ్యమైన నియంత్రణ మార్గాలు.

5. బరువు తగ్గించేందుకు ఆహార నియమాలు ఏమిటి?

  • తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవాలి

  • స్నాక్స్ స్థానంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి

  • షుగర్ మరియు ఆయిల్ ఎక్కువ ఉన్న పదార్థాలను తగ్గించాలి

6. ఊబకాయం చికిత్సలో శస్త్రచికిత్స అవసరమా?

తీవ్రమైన ఊబకాయం (BMI 40 కంటే ఎక్కువ) ఉన్నవారికి ఇతర మార్గాలు ఫలితాలు ఇవ్వకపోతే, డాక్టర్ సూచన మేరకు బరియాట్రిక్ సర్జరీ పరిగణించవచ్చు.


10, జూన్ 2025, మంగళవారం

Meghalaya Couple Missing : మేఘాలయ హనీమూన్ ట్రాజెడీ: హనీమూన్ ట్రిప్ ని భర్త అంతిమయాత్ర గా మార్చిన భార్య - దర్యాప్తులో దుమారం!

 

                           
Meghalaya Couple Missing

                

🔎 కాపురం కంటే కుట్రే ముందా?

Meghalaya Couple Missing Case : మేఘాలయ  పర్యటనలో హనీమూన్‌కు వెళ్లిన భార్యాభర్తల కథ ఒక్కసారిగా పెళ్ళికి ముందు ప్రేమ, కుట్ర, సుపారీ గాంగ్, హత్య వంటి అంశాల కలయికతో  మలుపు తిరిగిన  సంచలన కేసుగా మారింది. మధ్యప్రదేశ్‌కి చెందిన రాజా రఘువంశి శవం అగాధంలో కనిపించగా, ఆయన భార్య సోనం రఘువంశి ఎక్కడికిపోయిందన్న ప్రశ్న దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ నిదానంగా వెలుగులోకి వచ్చిన నిజాలు పోలీసులనే షాక్‌కు గురిచేశాయి.


📅 సంఘటనల క్ర‌మంలో:

  • మే 23: హనీమూన్ పర్యటనలో రాజా మరియు సోనం రఘువంశి మెఘాలయలో కనిపించిన చివరి రోజు

  • జూన్ 2: రాజా శవం Weisawdong ఫాల్స్ సమీపంలోని అగాధంలో కనిపించటం

  • జూన్ 7: సోనం ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన రోజు

💔 ప్రేమగా మొదలై హత్యగా ముగిసిన కొత్త జీవితం

సోనం తన భర్తను హత్య చేయించేందుకు ముగ్గురు హిత్‌మెన్లను ఏర్పాటు చేసిందని పోలీసు అధికారులు ధ్రువీకరించారు. దర్యాప్తులో ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా ప్రధాన సూత్రధారి అని బయటపడింది. సోనం – రాజ్ కలిసి ఈ దారుణ  హత్య కు ప్లాన్‌ను రూపొందించారట.


 హనీమూన్ విహారం  కాదు, మృత్యు కుహరం !

పోలీసుల కథనం ప్రకారం, సోనం తన భర్తను చెరాపుంజీలోని ఒంటరిగా ఉన్న మార్గానికి తీసుకెళ్లి అక్కడ హత్య చేయించేలా ప్లాన్ చేసిందట. హత్య అనంతరం, ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులు గౌహతికి వెళ్లి ఒక రోజు అక్కడ తలదాచుకున్నారు.


🔐 నిందితుల అరెస్టులు – దశల వారీగా సాగిన ఆపరేషన్

  • సోనం రఘువంశి – ఉత్తరప్రదేశ్‌ గాజీపూర్‌లోని ఒక ధాబాలో పట్టుబడి పోలీసులు విచారణకు తీసుకెళ్లారు

  • రాజ్ కుష్వాహా – సోనం ప్రియుడు, ప్రధాన సూత్రధారి, కస్టడీలో

  • విక్కీ ఠాకూర్, ఆకాశ్, ఆనంద్ – హత్యకు పాల్పడిన వ్యక్తులు, మధ్యప్రదేశ్‌లో అరెస్ట్


📱 సాంకేతిక ఆధారాలు – ఫోన్, సీసీటీవీ, రైడింగ్ స్కూటర్

  • హత్యకు ముందు సోనం, రాజ్ తరచూ ఫోన్‌లో మాట్లాడిన రికార్డులు

  • హోటల్‌లో సీసీటీవీ ఫుటేజీ ద్వారా సోనం ఉండటం రుజువు

  • హత్య జరిగిన ప్రాంతం సమీపంలో రత్తం మచ్చలతో ఉన్న మాచెటీ, రెయిన్‌కోట్, మరియు స్కూటర్‌ ఆధారాలు


ధాబా వ్యక్తి సమాచారం  – “ఆమె ఏడుస్తూ ఫోన్ అడిగింది...”

ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్ ధాబా వద్ద సోనం కనిపించిందని అక్కడి సిబ్బంది చెప్పారు. “ఆమె ఏడుస్తూ ఫోన్ కావాలని అడిగింది. తర్వాత తన సోదరుడికి కాల్ చేసింది. తర్వాత మేమే పోలీసులకు సమాచారం ఇచ్చాం,” అని ఒక సిబ్బంది తెలిపారు.


👮‍♀️ పోలీసుల ప్రకటన: “సోనం స్వయంగా లొంగిపోయింది”

మెఘాలయ పోలీసు అధికారి ఈదాశిషా నోంగ్రాంగ్ ప్రకారం, సోనం గాజీపూర్‌లోని నందగంజ్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా లొంగిపోయిందని తెలిపారు. ఆమెతో పాటు మొత్తం ఐదుగురు అరెస్ట్ చేయబడి, శిలాంగ్‌కు తరలింపు చేపట్టారు.


కుట్ర వెనుక ప్రేమ సంబంధమా?

ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉండటం బయటపడింది. సోనం – రాజ్ కుష్వాహా వివాహానికి ముందు నుంచే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పెళ్లి తర్వాత కూడా వారి మధ్య ఫోన్ ద్వారా సంభాషణలు కొనసాగుతూనే ఉన్నాయని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.


హతుడి తండ్రిని ఓదార్చిన హంతకుడు !

బండారం బట్టబయలు కాకముందు రాజా రఘు వంశీ మృతదేహం ఇంటికి తీసుకు వచ్చినప్పుడు, హంతకుడు రాజ్ కుష్వాహ వంశీ తండ్రిని ఓదారుస్తూ, తోడుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసి, ఏమీ ఎరగనట్టు వారికి మద్దతుగా నిలిచిన నిందితుని నిజాన్ని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇటువంటి మానవ మృగాలను ఎన్ కౌంటర్ చేయాలన్న తీవ్ర వ్యాఖ్యానాలతో విరుచుకుపడుతున్నారు. 


⚖️ చివరగా – చట్టం ముందు నిందితులు, బాధితుడికి న్యాయం కోరతాం

ఇప్పుడు ఈ కేసు న్యాయ విచారణ దశకు చేరింది. దేశవ్యాప్తంగా దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. నూతన జీవితం మొదలు పెట్టిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి చేతిలోనే హత్యకు గురయ్యాడంటే ఎంత దురదృష్టకరం! బాధితుడికి న్యాయం జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు.


ఇష్టం లేని పెళ్లి కి తల వంచడం ఎందుకు ? జీవిత భాగస్వామి అన్న కనికరం లేకుండా..కాళ్ళ పారాణి ఆరకుండానే అంత మొందించడం ఎందుకు ? ఒక సామాన్య యువతికి ఇంత దారుణ ఆలోచనలు కలగడానికి కారణం ఏమిటి ? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు.. ఈ అమానుష ఘటనతో రెండు కుటుంబాల భవితవ్యం అల్లకల్లోలం, అగమ్యగోచరం అయ్యింది. పదే పదే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతుండడం దేనికి సంకేతం? మానవ సమాజం నాగరికం వైపు పయనిస్తుందా..ఆటవిక సమాజం వైపు అడుగులు వేస్తుందా? ప్రతి ఒక్కరం ఆలోచన చేయాల్సిన తరుణం.