2, జులై 2025, బుధవారం

Harihara Veeramallu Trailer Release : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రేపు… పవన్ కల్యాణ్ ఎమోషనల్

 

                                                           
Harihara Veeramallu Trailer Release

Harihara Veeramallu Trailer Release : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది పండుగ వార్త. ఎన్నాళ్ళుగానో పవర్ స్టార్ పవన్ అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు  ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్ వచ్చేసింది. చారిత్రక నేపథ్యంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ఉదయం 11:10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్ వీక్షించిన పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కలిసి ట్రైలర్‌ను చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ కనిపించారు. ట్రైలర్‌లోని హై ఓల్టేజ్ సన్నివేశాలు చూసిన పవన్ కల్యాణ్ చిన్న పిల్లవాడిలా ఉత్సాహంతో నిండిపోయారు.

జ్యోతికృష్ణకు పవన్ హృదయపూర్వక అభినందన

వీడియో చివర్లో దర్శకుడు జ్యోతికృష్ణ వద్దకు వెళ్లిన పవన్, ‘చాలా కష్టపడ్డావ్’ అంటూ ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు. పవన్ కళ్యాణ్ యొక్క ఈ ఎమోషనల్ మూవ్మెంట్  అభిమానుల గుండెలను తాకకుండా ఉండదు. నిర్మాణ సంస్థ కూడా, “తుపాను వెనక ఉండే శక్తి... ట్రైలర్ చూసిన  పవన్ కూడా తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయారు” అని పేర్కొంది.

స్టార్ కాస్ట్, భారీ నిర్మాణం

మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని, ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, సునీల్, నాజర్  వంటి బడా నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

రెండు భాగాలుగా విడుదల

ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  మొదటి భాగానికి ‘హరిహర వీరమల్లు: పార్ట్‌ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో బలమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ ప్రేక్షకుల ఆశలను ఎన్ని రెట్లు పెంచుతుందో చూడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి