నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మన జీవన శైలి ఎంతో వేగంగా ఆధునికంగాను, సౌకర్యవంతంగాను, విలాసవంతంగాను మారుతున్న ప్రస్తుత తరుణంలో..అంతే వేగంగా కొత్త కొత్త సమస్యలు, అనర్ధాలు, నేరాలు , ఉపద్రవాలు సైతం తరుముకొస్తున్నాయి. మన చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలను గ్రహిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలసిన అవసరం ఉన్నది..తస్మాత్ జాగ్రత్త..అప్రమత్తం..!
29, అక్టోబర్ 2024, మంగళవారం
కొత్త సైబర్ దందా "డిజిటల్ అరెస్ట్"..అప్రమత్తం!
అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని సౌలభ్యాలు పొందుతున్నామో ..వాటితో పాటుగా ఎన్నో అనర్ధాలను కూడా చవి చూస్తున్నాము. ఇప్పటి వరకూ ఆదార్ వెరిఫికేషన్, పించన్ , లోన్స్ మంజూరు, బ్యాంక్ సిబ్బంది పేరిట కాల్స్ చేసి ఒటిపి లు అడగడం ద్వారా నగదు గల్లంతు చేస్తున్న సైబర్ మాయగాళ్ళు ఇప్పుడు "డిజిటల్ అరెస్ట్" అనే నయా సైబర్ దందాకు తెరతీసారు. ఈ తరహా మోసాలకు ఇప్పటికే భారతీయులు వందల కోట్లు నష్టపోయారు. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఫిర్యాదుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన ఈ డిజిటల్ మోసాల ను అరికట్ట డానికి ప్రయత్నాలు ఆరంభించాయి. సైబర్ స్కామర్స్ సమాజంలో సంపన్న వర్గాలను, వృద్దులను, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని, పోలీస్ అధికారులు, ఇన్కంటాక్స్ మరియు కస్టమ్స్ అధికారులుగా నమ్మించి ... " మీ బ్యాంక్ ఖాతాలోకి అక్రమంగా నగదు నిల్వలు ఉన్నాయని, మీ పేరిట వచ్చిన పార్సిల్ లో డ్రగ్స్ దొరికాయని " ఆడియో వీడియో కాల్స్ ద్వారా బాధితుల్ని బెంబేలిస్తారు..వారికి దిక్కుతోచని పరిస్థితి కల్పించి, " మీరు పెద్ద మొత్తంలో నగదు ఇస్తే ఈ నేరంలోంచి బయట పడేస్తామని , ఆలస్యం చేసినా..ఎవరికైనా చెప్పినా తక్షణమే "డిజిటల్ అరెస్ట్ " చేస్తామని బాధితుల్ని బెదిరించి , ఆఘమేఘాలపై ఆన్ లైన్ చెల్లింపులు చేయించుకోవడం ద్వారా నగదు కొల్ల గొడుతున్నారు.
కొన్ని సందర్భాల్లో బాధితులను నమ్మించడానికి, భయభ్రాంతులను చేయడానికి పోలీస్ స్టేషన్ , కోర్ట్ రూమ్ సెట్టింగ్స్ కూడా వేసి పకడ్భందీగా మోసాలు చేస్తున్నారు. బాధితుల్లో ఉన్నత స్థాయి ప్రముఖులు, ప్రొఫెసర్ లు , సైంటిస్ట్ లు , మేధావులు వంటి వారు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ సైతం రంగంలోకి దిగి తన "మన్ కి బాత్" కార్యక్రమం ద్వారా "డిజిటల్ అరెస్ట్ " సైబర్ మోసాలను ప్రస్తావించి, తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేసారు అంటేనే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఈ "డిజిటల్ అరెస్ట్ " సైబర్ మోసాల గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడమే ప్రధాన నివారణ మార్గంగా తలచిన ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
డిజిటల్ మోసాలపై అవగాహన మరియు జాగ్రత్తలు
ఇప్పుడు డిజిటల్ యుగంలో మనం చాలా భాగం ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకుంటున్నాం, అలా ఉండటం చాలా సౌకర్యంగా ఉంటున్నప్పటికీ, కొన్ని మోసాలు సైతం విస్తరించాయి. ఇటువంటి మోసాలు మనం సులభంగా బాధితులమై ఆర్థిక నష్టం చవిచూడే అవకాశముంది. ఈ నేపధ్యంలో డిజిటల్ మోసాల గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం.
1. ఫిషింగ్ మెసేజ్‌లు:
ఫిషింగ్ మెసేజ్‌లు ద్వారా, మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వివరాలను చోరించడానికి ప్రయత్నిస్తారు. ఈ సందేశాలు సాధారణంగా బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల పేరు మీద ఉంటాయి. ఒకవేళ మీకు సందేహం ఉన్న సందేశం వస్తే, దాన్ని నేరుగా క్లిక్ చేయకుండా, దాని నిజస్వభావం తెలుసుకునే ప్రయత్నం చేయండి.
2. OTP మరియు పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దు:
బ్యాంకులు, UPI పేమెంట్ అప్లికేషన్లు ఎప్పుడూ మీ పాస్‌వర్డ్ లేదా OTP గురించి అడగవు. ఎవరికైనా ఈ వివరాలు అందించడం చాలా ప్రమాదకరం. మీ ఖాతాలు, ట్రాన్సాక్షన్ మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచండి.
3. నకిలీ యాప్‌లు మరియు వెబ్‌సైట్లు:
నకిలీ యాప్‌లు మరియు వెబ్‌సైట్ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. సురక్షితమైన ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండే యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదమైన లింక్ క్లిక్ చేయడానికి ముందే దాని నిజమైన URLను జాగ్రత్తగా పరిశీలించండి.
4. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్:
ఏదైనా మోసానికి గురైతే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. జాగ్రత్తగా మరియు సురక్షితంగా ఉండటం మాత్రమే మనల్ని రక్షిస్తుంది.
________________________________________
ఈ సూచనలు పాటించడం ద్వారా మన డిజిటల్ లావాదేవీలు మరింత భద్రంగా ఉంటాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
మారం చేయకుండా తింటారని, బుద్దిగా ఒక చోట కూర్చుంటారని, తమ దైనందిన కార్యక్రమాలకు ఆటంకపరచరని తదితర కారణాలతో పిల...
-
అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని సౌలభ్యాలు పొందుతున్నామో ..వాటితో పాటుగా ఎన్నో అనర్ధాలను కూడా చవి చూస్తున్నాము. ఇప్...
-
వృద్దాప్యం ఒక శాపమా ..? కానేకాదు..ముందస్తు ఆర్ధిక, ఆరోగ్య క్రమశిక్షణ ప్ర...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి