నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మన జీవన శైలి ఎంతో వేగంగా ఆధునికంగాను, సౌకర్యవంతంగాను, విలాసవంతంగాను మారుతున్న ప్రస్తుత తరుణంలో..అంతే వేగంగా కొత్త కొత్త సమస్యలు, అనర్ధాలు, నేరాలు , ఉపద్రవాలు సైతం తరుముకొస్తున్నాయి. మన చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలను గ్రహిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలసిన అవసరం ఉన్నది..తస్మాత్ జాగ్రత్త..అప్రమత్తం..!
30, అక్టోబర్ 2024, బుధవారం
ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం ! online betting apps in india
సాంకేతిక పరిజ్ఞానం అన్నది ఇరువైపులా పదును ఉన్న కత్తిలాంటి ఆయుధం. అది డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు పోస్తుంది..ఉన్మాది చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది..ఫలితం దాన్ని మనం వినియోగించుకొనే విధానంలోనే ఉంటుంది. జూదం అన్నది మహా మహులు, మహనీయులు అయిన వారిని కూడా ఎంతగా దిగాజార్చిందో, ఎంతగా ఇబ్బందులపాలు చేసిందో అనాదిగా మనకు రుజువు అవుతూనే ఉన్నది.పేకాట, మట్ఖ, కోడి పందాలు ఇలా బెట్టింగ్ కి ఎన్నో రూపాల, అవకాశాలు. టెక్నాలజీ అంతగా అభివృద్ధి సాధించని రోజుల్లో,జూదానికి చట్టపరమైన అవరోధాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఆ వ్యసనం పరిమితుల్లో ఉండేది. నేటి ఆధునిక కాలంలో క్రికెట్, టెక్నాలజీ ప్రాచుర్యం పొందడంతో ఆన్ లైన్ బెట్టింగ్ ఊపు అందుకుందని చెప్పొచ్చు. అన్ని సౌలభ్యాలు సెల్ ఫోన్ తో చేతిలో ఉన్న ప్రస్తుత కాలంలో ఎన్నో ఎన్నెన్నో అధికారిక, అనధికారిక బెట్టింగ్ యాప్స్..ప్రజలలో విపరీత ఆదరణ ఉన్న సెలబ్రిటీలు సైతం తమ ఆదాయం, స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించడం ఎన్నో అనర్ధాలకు హేతువు అవుతుంది.స్కూల్ కు వెళ్ళే స్టూడెంట్ నుండి కోట్ల లో వేర్షిక వేతనాలు అందుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుని విల విల లాడుతున్నవారే. తేలికగా డబ్బు సంపాదించాలని, ఆకస్మికంగా ధనవంతులు కావాలన్న దురాసతో అప్పులపాలు అవుతున్నారు.అటు అప్పులు తీర్చలేక, ఇటు ఆ వ్యసనం నుండి బయట పడలేక, తీవ్ర ఒత్తిడి మానసిక వేదనకు గురై ఆత్మహాత్య వంటి ప్రయత్నాలు చేస్తున్న విషాద ఘటనలు కోకొల్లలు. ఈ ఘటనలలో విద్యార్థులు, యువత అధికంగా ఉండడం గమనార్హం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తగు పరిశీలనలో ఉండడం, వారితో ఎప్పటికప్పుడు సానుకూలంగా మాట్లాడు తుండడం బెట్టింగ్ వ్యసనం ను ముందుగానే గుర్తించడం ద్వారా వారిని సంరక్షించుకొనే అవకాశాన్ని కలిగి ఉండొచ్చు.
ఆన్‌లైన్ బెట్టింగ్ వలన ప్రధాన సమస్యలు :
1. వ్యసనం: ఆన్‌లైన్ బెట్టింగ్ చాలా వ్యసనపరమైనది, ఇది ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలకు దారి తీస్తుంది.
2. ఆర్థిక నష్టం: బెట్టింగ్ వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు వస్తాయి, అప్పులు మరియు ఆర్థిక కష్టాలకు దారి తీస్తుంది.
3. భద్రతా సమస్యలు: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండకపోవచ్చు, వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
4. నియంత్రణ లేకపోవడం: కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు నియంత్రించబడకపోవచ్చు, ఇది సరసమైన ఆటను నిర్ధారించడం మరియు వినియోగదారులను రక్షించడం కష్టతరం చేస్తుంది.
5. సామాజిక ఒంటరితనం: అధిక ఆన్‌లైన్ బెట్టింగ్ సామాజిక ఒంటరితనానికి దారితీస్తుంది మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పరస్పర అనుబంధాలను ప్రతికూలంగా మారుస్తుంది.
6. మానసిక ఆరోగ్యం: ఆన్‌లైన్ బెట్టింగ్ ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
7. స్కామ్‌లు మరియు మోసం: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు స్కామ్‌లు మరియు మోసాలకు గురయ్యే అవకాశం ఉంది, ఫలితంగా ఆర్థిక నష్టాలు వస్తాయి.
8. టైమ్ మేనేజ్‌మెంట్: ఆన్‌లైన్ బెట్టింగ్ గణనీయమైన సమయం హరించడం, పని, సంబంధాలు మరియు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
9. మద్దతు లేకపోవడం: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు సమస్య జూదగాళ్లకు తగిన మద్దతు లేదా వనరులను అందించకపోవచ్చు.
చట్టపరమైన సమస్యలు: కొన్ని అధికార పరిధిలో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధం కావచ్చు, ఫలితంగా చట్టపరమైన పరిణామాలు ఉంటాయి.
ఈ ఇబ్బందుల గురించి తెలుసుకోవడం మరియు ఆన్‌లైన్ బెట్టింగ్‌ను జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనతో సంప్రదించడం చాలా అవసరం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
మారం చేయకుండా తింటారని, బుద్దిగా ఒక చోట కూర్చుంటారని, తమ దైనందిన కార్యక్రమాలకు ఆటంకపరచరని తదితర కారణాలతో పిల...
-
అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని సౌలభ్యాలు పొందుతున్నామో ..వాటితో పాటుగా ఎన్నో అనర్ధాలను కూడా చవి చూస్తున్నాము. ఇప్...
-
వృద్దాప్యం ఒక శాపమా ..? కానేకాదు..ముందస్తు ఆర్ధిక, ఆరోగ్య క్రమశిక్షణ ప్ర...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి