వృద్దాప్యం ఒక శాపమా ..? కానేకాదు..ముందస్తు ఆర్ధిక, ఆరోగ్య క్రమశిక్షణ ప్రణాళికలు రూపొందించుకొని, వాటిని సక్రమంగా అమలుపరిస్తే వృద్దాప్యం అన్నది ఒక వరంగా మారుతుంది. ఆర్ధిక క్రమశిక్షణ పాటించకున్నా ఆరోగ్య క్రమశిక్షణ మాత్రం తప్పకుండా పాటించాలి. గొప్ప సంపద కలిగి ఉన్నా కూడా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన పరిస్థితి ఉన్నప్పుడు అది దుర్భరమే. సాధారణ జీవితం గడుపుతున్నప్పటికీ ముసలితనంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఒకరి ఆసరా లేకుండా తమ దైనందిన కార్యక్రమాలు జరుపుకోగాలిగేవాళ్ళు నిజమైన భాగ్యవంతులు. వారికి వృద్దాప్యం ఒక వరమే అని చెప్పొచ్చు.
భారతదేశ వారెన్ బఫెట్ గా కీర్తించబడే రాకేశ్ జున్ జున్ వాలా తన 62 ఏట తీవ్ర అనారోగ్య కారణాలతో చనిపోయారు. 1985 లో 25 సంవత్సరాల ప్రాయంలో కేవలం 5 వేల రూపాయలు స్టాక్ మార్కెట్ పెట్టుబడితో ప్రారంభించి 2021 నాటికీ తన సంపదను 34 వేల కోట్ల గా వృద్ది చేసుకున్న భారత దేశ సంపన్నుల్లో ఒకరుగా నిలిచిన ఆర్ధిక మేథావి. ఆయన తన చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్యు లలో తాను పెట్టిన అన్ని పెట్టుబడులు అన్నీ మంచి రాబడిని ఇచ్చాయని..కానీ ఒక్క తన ఆరోగ్యం పైనే సరి అయిన పెట్టుబడి పెట్టలేక పోయానని ఆవేదన చెందారు. ప్రస్తుతం పెరిగిన మనిషి సగటు ఆయుర్దాయంతో పోల్చినట్టయితే ఆయన తన ప్రస్థానాన్ని త్వరగానే ముగించినట్టు.
దీన్నిబట్టి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే..ఆర్ధిక సంపద కంటే, ఆరోగ్య సంపద ఎంతో ముఖ్యం అన్న వాస్తవం. ఆరోగ్యంతోపాటుగా ఆర్ధిక తోడ్పాటు ఉంటే ఆ వార్ధక్యం కూడా అద్భుతంగా ఉంటుంది. " కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్దులు " అని మహాకవి శ్రీ శ్రీ అన్నట్టుగా చాలా మంది యువతలో జన్యుపరమైన, మానసిక ఒత్తిడి, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం తదితర కారణాల వలన తలెత్తుతున్న దీర్ఘ కాల అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందువలన ఏ వయసులో ఉన్న వారైనా ఆరోగ్యంగా, చురుకుగా, ఉల్లాసంగా గడుపడం అన్నదే ఎంతో ముఖ్యం... మరెంతో భాగ్యం..!
నగరాలు, పట్టణాలలో ఉదయం, సాయంత్రం వేళలో ఎంత మంది వృద్దులు యువకులతో పోటీలు పడి మరీ చలాకీగా నడుస్తుంటారో గమనిస్తూనే ఉంటాం. అలాగే గ్రామాలలో 70,80 ఏళ్ల వయసులో ఉన్న ఆడ, మగ వ్యవసాయ పనులు ఇతర గ్రామీణ పనులు ఎంత చురుకుగా చేసుకుంటారో తెలిసిన విషయమే. త్వరగా వయసు మీదపడటాన్నిఎవరు ఇష్టపడరు. కానీ మనకు ఇష్టం లేదుకదా అని జరగబోయేదాన్ని ఎట్టిపరిస్థితుల్లో తప్పించలేము. తప్పించుకోలేము. కాబట్టి తగిన ముందస్తు ఆర్ధిక, ఆరోగ్య ప్రణాళికలను రూపొందించుకొని..సమర్థవంతంగా అమలుపరుస్తూ..ఉత్సాహంగా వృద్ధాప్యాన్ని ఆహ్వానించడానికి సిద్దపడదాము.
ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం ! online betting apps in india
ఆరోగ్యంగా మరియు సుఖంగా వృద్ధాప్యాన్ని గడిపే చర్యలు
వృద్ధాప్యం జీవితం లో ఒక సహజమయిన దశ. ఈ దశలో మానసిక, శారీరక ఆరోగ్యం సమతుల్యంగా ఉండటం అవసరం. అందుకే, ప్రణాళికతో ముందుకు వెళ్ళి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన వృద్ధాప్యాన్ని గడపడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవడం మంచిది.
1. శారీరక ఆరోగ్యం కోసం చర్యలు
- నిత్యముగా వ్యాయామం: రోజుకి కనీసం 30 నిమిషాల పాటు యోగా, నడక, లేదా హృదయానందక వ్యాయామాలు చేయాలి. ఇవి శరీరాన్ని దృఢంగా ఉంచడమే కాకుండా, మనసును కూడా ఉల్లాసంగా ఉంచుతాయి.
- ఆహార నియమాలు పాటించండి: బలవర్ధకమైన, పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. చక్కెర, కొవ్వు, మరియు ఉప్పు తగ్గించుకుని, పండ్లు, కూరగాయలు, మరియు పొటాషియం-సమృద్ధ ఆహారం తీసుకోవాలి.
- పరిమితంగా విహారం: శరీరానికి కదలికలివ్వడం ముఖ్యమే అయినా, అధిక శ్రమ చేసేటట్లు ఉండకూడదు.
2. మానసిక ఆరోగ్యం కోసం చర్యలు
- ఆధ్యాత్మిక అభ్యాసం: ధ్యానం, ప్రార్థన, లేదా మీకు ఇష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
- కుటుంబంతో సమయాన్ని గడపడం: మనసుకు నిశ్చింత కలిగించడానికి కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని పెంపొందించండి.
- ప్రేరణాత్మక పుస్తకాలు చదవడం: మనసును ఉల్లాసంగా ఉంచడానికి ఉత్తేజకరమైన పుస్తకాలు, కథలు చదవండి.
3. ఆర్థిక సురక్షితత
- పెన్షన్ ప్రణాళికలు: వృద్ధాప్యానికి ముందే, పధకాలు మరియు సురక్షితమైన పెట్టుబడులు చేపట్టండి.
- ఖర్చు నియంత్రణ: అవసరాలకే ఖర్చు పెట్టి, అవసరమైనంత నిధులను భద్రపరుచుకోవడం మంచిది.
- సేవలు వినియోగించడం: ప్రభుత్వ పథకాలు లేదా నిత్యావసర సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు.
4. సమాజంలో భాగస్వామ్యం
- సామాజిక కార్యక్రమాలు: వృద్ధాప్య అసోసియేషన్లు, సేవా కార్యక్రమాల్లో చేరి సమాజానికి తోడ్పాటు అందించండి.
- స్నేహితుల వలయం: మీలాంటి వ్యక్తులతో స్నేహసంబంధాలను కొనసాగించి, మీరు ఒంటరితనాన్ని దూరం చేయవచ్చు.
5. సరదా కార్యక్రమాలు
- కొత్త విషయాలు నేర్చుకోండి: సంగీతం, చిత్రలేఖనం, లేదా కొత్త భాషలంటివి నేర్చుకోవడం ద్వారా మీ రోజులను ఆసక్తికరంగా మార్చుకోండి.
- సందర్శన: ఆరోగ్యానికి అనుకూలమైన ప్రదేశాలకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించండి.
వృద్ధాప్యాన్ని ప్రశాంతంగా మరియు ఆరోగ్యకరంగా గడపడానికి వీటిని ఆచరణలో పెడితే, జీవితం మరింత సంతోషకరంగా ఉంటుంది. సత్వర నిశ్చయం, సరైన ప్రణాళిక, మరియు స్వీయ కృషి వృద్ధాప్యాన్ని స్వర్గధామంలా మార్చగలవు.
మీ ఆరోగ్యమూ... సంతోషమూ మీ చేతుల్లోనే ఉన్నాయి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి