31, అక్టోబర్ 2024, గురువారం

పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం : Impact of Mobile phones use on children

పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం : Impact of Mobile phones use on children
                              మారం చేయకుండా తింటారని, బుద్దిగా ఒక చోట కూర్చుంటారని, తమ దైనందిన కార్యక్రమాలకు ఆటంకపరచరని తదితర కారణాలతో పిల్లలకు మొబైల్ ఫోన్స్ అందించడం అన్నది ప్రతి ఇంట్లోను సర్వ సాధారణ విషయం అయిపోయింది. ఈ అలవాటును మాన్పించకుంటే..అది పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పిల్లల వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానం తెలియని వయసు కావడంతో వారు అవాంచిత సమాచారాన్ని గ్రహించే ప్రమాదం ఉంది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న అనేక నేరాలు, ఘోరాలలో పెరుగుతున్న మైనర్ ల పాత్రకు ఇదీ ఒక ప్రధాన కారణంగా ఆయా దర్యాప్తు, విచారణ సమయాలలో వెల్లడవుతుంది. పిల్లలు కుదురుగా ఉంటున్నారన్న ఒక్క కారణంగా ఈ విపరీతాన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు రేపటి వారి పిల్లల భవిష్యత్ ను చీకటి మయం చేస్తున్నామన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. 

                                      ఇటీవల జరిగిన కొన్ని భయంకర నేరాలలో కరడుగట్టిన పాత నేరస్తుల పాత్ర ఉంటుందని పోలీసు అధికారుల అంచనాలను తల క్రిందులు చేస్తూ మైనర్ బాలల పాత్ర నిర్ధారణ అయి విస్తుగొలిపిన కేసులు ఎన్నో..ఎన్నెన్నో..ఇప్పటికైనా ఈ పిల్లల మొబైల్ అతి వినియోగం జాడ్యం పై తగిన పర్యవేక్షణ, నివారణ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ దుష్పరిణామాలు స్వయంకృతాపరాధమే అవుతాయి. 

ఈ అలవాటు మాన్పించడానికి మానసిక నిపుణులు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు: 

1.స్క్రీన్ టైమ్ పరిమితులు ఏర్పరచండి : ప్రతి రోజూ మొబైల్ వినియోగానికి సమయం పరిమితం చేయండి, ముఖ్యంగా వినోదం కోసం. ఇది ఎక్కువగా ఉపయోగించకుండా ఉండేందుకు సమయ నియంత్రణ సెట్టింగ్స్ లేదా పెరెంటల్ కంట్రోల్ యాప్‌లను ఉపయోగించండి. 

2.  ఇతర అలవాట్లు, కార్యకలాపాలకు ప్రోత్సహించండి : క్రీడలు, పుస్తకాలు చదవడం లేదా హస్తకళల వంటి ఆఫ్‌లైన్ కార్యకలాపాలకు ప్రోత్సహించండి. పిల్లలు ఆసక్తికరమైన ఇతర విషయాలలో పాల్గొంటే, వారు మొబైల్‌కు ఎక్కువగా ఆకర్షించబడరు. 

3.  "డివైస్-ఫ్రీ" జోన్స్‌ను సృష్టించండి : కుటుంబ భోజనాలు లేదా నిద్రకు ముందు వంటి సమయంలో మొబైల్‌ లేనటువంటి ప్రత్యేక స్థలాలను లేదా సమయాలను ఏర్పాటు చేయండి. ఇది మొబైల్ వినియోగానికి ప్రత్యామ్నాయాన్ని ఇస్తుంది. 

4. మీరు రోల్ మోడల్ అవ్వాలి : మీరు కూడా మొబైల్ వినియోగాన్ని పరిమితంగా ఉంచుతూ పిల్లలకు తగిన ఆదర్శంగా ఉండండి. పిల్లలు చాలా సందర్భాలలో తల్లిదండ్రుల అలవాట్లను అనుకరిస్తారు. 

5.  విద్యా సామగ్రిని పరిమితంగా ఉపయోగించండి : విద్యా సంబంధిత యాప్‌లు, కంటెంట్‌ను అపరిమితంగా కాకుండా, తగ్గించి ఉపయోగించండి. ఇది వారు విద్యా ఉద్దేశ్యంతో మొబైల్ ఉపయోగాన్ని పరిమితంగా అనుభవించడానికి తోడ్పడుతుంది. 

6.  సామాజిక పరస్పర చర్యలకు ప్రోత్సహించండి : స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలుసుకునే అవకాశాలు కల్పించండి. ముఖాముఖి పరస్పర చర్యలు పిల్లలకు అవసరమైన సామాజిక నైపుణ్యాలను పెంపొందించడంలో మరియు ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉండకుండా చేయడంలో సహాయపడతాయి. 

 ఈ మార్గదర్శకాలు మొబైల్ వినియోగాన్ని ఆరోగ్యంగా, సమతుల్యతగా ఉంచడంలో పిల్లల పెంపొందనకు తోడ్పడతాయి.

30, అక్టోబర్ 2024, బుధవారం

ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం ! online betting apps in india

ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం ! online betting apps in india
సాంకేతిక పరిజ్ఞానం అన్నది ఇరువైపులా పదును ఉన్న కత్తిలాంటి ఆయుధం. అది డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు పోస్తుంది..ఉన్మాది చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది..ఫలితం దాన్ని మనం వినియోగించుకొనే విధానంలోనే ఉంటుంది. జూదం అన్నది మహా మహులు, మహనీయులు అయిన వారిని కూడా ఎంతగా దిగాజార్చిందో, ఎంతగా ఇబ్బందులపాలు చేసిందో అనాదిగా మనకు రుజువు అవుతూనే ఉన్నది.పేకాట, మట్ఖ, కోడి పందాలు ఇలా బెట్టింగ్ కి ఎన్నో రూపాల, అవకాశాలు. టెక్నాలజీ అంతగా అభివృద్ధి సాధించని రోజుల్లో,జూదానికి చట్టపరమైన అవరోధాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఆ వ్యసనం పరిమితుల్లో ఉండేది. నేటి ఆధునిక కాలంలో క్రికెట్, టెక్నాలజీ ప్రాచుర్యం పొందడంతో ఆన్ లైన్ బెట్టింగ్ ఊపు అందుకుందని చెప్పొచ్చు. అన్ని సౌలభ్యాలు సెల్ ఫోన్ తో చేతిలో ఉన్న ప్రస్తుత కాలంలో ఎన్నో ఎన్నెన్నో అధికారిక, అనధికారిక బెట్టింగ్ యాప్స్..ప్రజలలో విపరీత ఆదరణ ఉన్న సెలబ్రిటీలు సైతం తమ ఆదాయం, స్వలాభం కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించడం ఎన్నో అనర్ధాలకు హేతువు అవుతుంది.స్కూల్ కు వెళ్ళే స్టూడెంట్ నుండి కోట్ల లో వేర్షిక వేతనాలు అందుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుని విల విల లాడుతున్నవారే. తేలికగా డబ్బు సంపాదించాలని, ఆకస్మికంగా ధనవంతులు కావాలన్న దురాసతో అప్పులపాలు అవుతున్నారు.అటు అప్పులు తీర్చలేక, ఇటు ఆ వ్యసనం నుండి బయట పడలేక, తీవ్ర ఒత్తిడి మానసిక వేదనకు గురై ఆత్మహాత్య వంటి ప్రయత్నాలు చేస్తున్న విషాద ఘటనలు కోకొల్లలు. ఈ ఘటనలలో విద్యార్థులు, యువత అధికంగా ఉండడం గమనార్హం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తగు పరిశీలనలో ఉండడం, వారితో ఎప్పటికప్పుడు సానుకూలంగా మాట్లాడు తుండడం బెట్టింగ్ వ్యసనం ను ముందుగానే గుర్తించడం ద్వారా వారిని సంరక్షించుకొనే అవకాశాన్ని కలిగి ఉండొచ్చు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ వలన ప్రధాన సమస్యలు : 1. వ్యసనం: ఆన్‌లైన్ బెట్టింగ్ చాలా వ్యసనపరమైనది, ఇది ఆర్థిక మరియు వ్యక్తిగత సమస్యలకు దారి తీస్తుంది. 2. ఆర్థిక నష్టం: బెట్టింగ్ వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు వస్తాయి, అప్పులు మరియు ఆర్థిక కష్టాలకు దారి తీస్తుంది. 3. భద్రతా సమస్యలు: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండకపోవచ్చు, వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని ప్రమాదంలో పడేస్తాయి. 4. నియంత్రణ లేకపోవడం: కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు నియంత్రించబడకపోవచ్చు, ఇది సరసమైన ఆటను నిర్ధారించడం మరియు వినియోగదారులను రక్షించడం కష్టతరం చేస్తుంది. 5. సామాజిక ఒంటరితనం: అధిక ఆన్‌లైన్ బెట్టింగ్ సామాజిక ఒంటరితనానికి దారితీస్తుంది మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పరస్పర అనుబంధాలను ప్రతికూలంగా మారుస్తుంది. 6. మానసిక ఆరోగ్యం: ఆన్‌లైన్ బెట్టింగ్ ఆందోళన మరియు నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. 7. స్కామ్‌లు మరియు మోసం: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు స్కామ్‌లు మరియు మోసాలకు గురయ్యే అవకాశం ఉంది, ఫలితంగా ఆర్థిక నష్టాలు వస్తాయి. 8. టైమ్ మేనేజ్‌మెంట్: ఆన్‌లైన్ బెట్టింగ్ గణనీయమైన సమయం హరించడం, పని, సంబంధాలు మరియు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. 9. మద్దతు లేకపోవడం: ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు సమస్య జూదగాళ్లకు తగిన మద్దతు లేదా వనరులను అందించకపోవచ్చు. చట్టపరమైన సమస్యలు: కొన్ని అధికార పరిధిలో ఆన్‌లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధం కావచ్చు, ఫలితంగా చట్టపరమైన పరిణామాలు ఉంటాయి. ఈ ఇబ్బందుల గురించి తెలుసుకోవడం మరియు ఆన్‌లైన్ బెట్టింగ్‌ను జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనతో సంప్రదించడం చాలా అవసరం.

29, అక్టోబర్ 2024, మంగళవారం

కొత్త సైబర్ దందా "డిజిటల్ అరెస్ట్"..అప్రమత్తం!

కొత్త సైబర్ దందా "డిజిటల్ అరెస్ట్"..అప్రమత్తం! Digital arrest
అంతకంతకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని సౌలభ్యాలు పొందుతున్నామో ..వాటితో పాటుగా ఎన్నో అనర్ధాలను కూడా చవి చూస్తున్నాము. ఇప్పటి వరకూ ఆదార్ వెరిఫికేషన్, పించన్ , లోన్స్ మంజూరు, బ్యాంక్ సిబ్బంది పేరిట కాల్స్ చేసి ఒటిపి లు అడగడం ద్వారా నగదు గల్లంతు చేస్తున్న సైబర్ మాయగాళ్ళు ఇప్పుడు "డిజిటల్ అరెస్ట్" అనే నయా సైబర్ దందాకు తెరతీసారు. ఈ తరహా మోసాలకు ఇప్పటికే భారతీయులు వందల కోట్లు నష్టపోయారు. ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న ఫిర్యాదుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన ఈ డిజిటల్ మోసాల ను అరికట్ట డానికి ప్రయత్నాలు ఆరంభించాయి. సైబర్ స్కామర్స్ సమాజంలో సంపన్న వర్గాలను, వృద్దులను, రిటైర్డ్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని, పోలీస్ అధికారులు, ఇన్కంటాక్స్ మరియు కస్టమ్స్ అధికారులుగా నమ్మించి ... " మీ బ్యాంక్ ఖాతాలోకి అక్రమంగా నగదు నిల్వలు ఉన్నాయని, మీ పేరిట వచ్చిన పార్సిల్ లో డ్రగ్స్ దొరికాయని " ఆడియో వీడియో కాల్స్ ద్వారా బాధితుల్ని బెంబేలిస్తారు..వారికి దిక్కుతోచని పరిస్థితి కల్పించి, " మీరు పెద్ద మొత్తంలో నగదు ఇస్తే ఈ నేరంలోంచి బయట పడేస్తామని , ఆలస్యం చేసినా..ఎవరికైనా చెప్పినా తక్షణమే "డిజిటల్ అరెస్ట్ " చేస్తామని బాధితుల్ని బెదిరించి , ఆఘమేఘాలపై ఆన్ లైన్ చెల్లింపులు చేయించుకోవడం ద్వారా నగదు కొల్ల గొడుతున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులను నమ్మించడానికి, భయభ్రాంతులను చేయడానికి పోలీస్ స్టేషన్ , కోర్ట్ రూమ్ సెట్టింగ్స్ కూడా వేసి పకడ్భందీగా మోసాలు చేస్తున్నారు. బాధితుల్లో ఉన్నత స్థాయి ప్రముఖులు, ప్రొఫెసర్ లు , సైంటిస్ట్ లు , మేధావులు వంటి వారు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ సైతం రంగంలోకి దిగి తన "మన్ కి బాత్" కార్యక్రమం ద్వారా "డిజిటల్ అరెస్ట్ " సైబర్ మోసాలను ప్రస్తావించి, తగు జాగ్రత్తలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేసారు అంటేనే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఈ "డిజిటల్ అరెస్ట్ " సైబర్ మోసాల గురించి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడమే ప్రధాన నివారణ మార్గంగా తలచిన ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. డిజిటల్ మోసాలపై అవగాహన మరియు జాగ్రత్తలు ఇప్పుడు డిజిటల్ యుగంలో మనం చాలా భాగం ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసుకుంటున్నాం, అలా ఉండటం చాలా సౌకర్యంగా ఉంటున్నప్పటికీ, కొన్ని మోసాలు సైతం విస్తరించాయి. ఇటువంటి మోసాలు మనం సులభంగా బాధితులమై ఆర్థిక నష్టం చవిచూడే అవకాశముంది. ఈ నేపధ్యంలో డిజిటల్ మోసాల గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు తెలుసుకుందాం. 1. ఫిషింగ్ మెసేజ్‌లు: ఫిషింగ్ మెసేజ్‌లు ద్వారా, మోసగాళ్లు మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం వంటి వివరాలను చోరించడానికి ప్రయత్నిస్తారు. ఈ సందేశాలు సాధారణంగా బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థల పేరు మీద ఉంటాయి. ఒకవేళ మీకు సందేహం ఉన్న సందేశం వస్తే, దాన్ని నేరుగా క్లిక్ చేయకుండా, దాని నిజస్వభావం తెలుసుకునే ప్రయత్నం చేయండి. 2. OTP మరియు పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దు: బ్యాంకులు, UPI పేమెంట్ అప్లికేషన్లు ఎప్పుడూ మీ పాస్‌వర్డ్ లేదా OTP గురించి అడగవు. ఎవరికైనా ఈ వివరాలు అందించడం చాలా ప్రమాదకరం. మీ ఖాతాలు, ట్రాన్సాక్షన్‌ మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచండి. 3. నకిలీ యాప్‌లు మరియు వెబ్‌సైట్లు: నకిలీ యాప్‌లు మరియు వెబ్‌సైట్ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. సురక్షితమైన ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండే యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఏదైనా అనుమానాస్పదమైన లింక్ క్లిక్ చేయడానికి ముందే దాని నిజమైన URLను జాగ్రత్తగా పరిశీలించండి. 4. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: ఏదైనా మోసానికి గురైతే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. జాగ్రత్తగా మరియు సురక్షితంగా ఉండటం మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ________________________________________ ఈ సూచనలు పాటించడం ద్వారా మన డిజిటల్ లావాదేవీలు మరింత భద్రంగా ఉంటాయి.