12, మే 2025, సోమవారం

Allu Arjun meets Amir Khan : ముంబై లో అమిర్ ఖాన్ తో అల్లు అర్జున్ భేటీ… “మహాభారతం” కోసమేనా?.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

 

                                                                     

Allu Arjun meets Amir Khan

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్  అమిర్ ఖాన్‌ను ముంబయిలో ప్రత్యేకంగా కలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. అమిర్ ఖాన్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లిన బన్నీ, ఆయనతో కొంతసేపు చర్చలు జరిపారు. ఈ అకస్మాత్తు భేటీకి సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. అమిర్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సితారే జమీన్ పర్” పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో “మహాభారతం” అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకోవాలని అమిర్ భావిస్తున్నాడని గతంలోనే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బన్నీని ప్రత్యేకంగా కలవడం, ఆయనతో సమాలోచనలు జరపడం ఈ క్రేజీ  ప్రాజెక్ట్ కోసమే  అయి  ఉంటుందనే టాక్ బాలీవుడ్, టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇది నిజమయితే మాత్రం  అల్లు అర్జున్ మరియు అమీర్ ఖాన్ అభిమానులకు కనుల పండుగ అనే చెప్పొచ్చు. 

ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదుగానీ, ఈ భేటీ  భారత దేశ  సినీ అభిమానులను తీవ్ర ఆసక్తిని, ఉత్కంటను రేకిట్టిస్తున్నది. ఒకవేళ ఇది నిజమైతే, అల్లు అర్జున్ “మహాభారతం” లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ సర్కిళ్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి