5, నవంబర్ 2024, మంగళవారం

Helmet Awareness : "క్షేమంగా ఇంటికి రా నాన్నా..!"...హెల్మెట్ వినియోగంపై ఏలూరు జిల్లా పోలీస్ వినూత్న ప్రచారం

Helmet Awareness :   ఏలూరు జిల్లా పోలీస్ వినూత్న ప్రచారం
                          దేశంలో ప్రతిరోజూ జరుగుతున్న రహదారి ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది. రహదార్ల నిర్వహణ లోపం, తగిన సామర్ధ్యం లేని వాహనాలు, పరిమితికి మించి రవాణా, సరైన రహదారి భద్రత చర్యలు తీసుకోక పోవడం ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కార్లు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ద్విచక్ర మోటార్ వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వినియోగించకపోవడం వలనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై ఎంతగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ తగిన స్పందన రావడం లేదు. రోడ్డు ప్రమాద మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో చేస్తున్న వినూత్న ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టు కోవడంతోపాటు, ఆలోచింప చేస్తున్నది. రోడ్డు ప్రమాదాలలో పూర్తిగా ధ్వంసం అయి ఎందుకు పనికిరాకుండా పడి ఉన్న వాహనాలను నేషనల్ హైవేలో తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో రోడ్డుకు పక్కగా నిలిపి ఉంచుతున్నారు. ఆ వాహనాల వద్ద " నాన్న..పది నిముషాలు ఆలస్యమైన పర్వాలేదు..క్షేమంగా ఇంటికి రండి " అన్న ప్లకార్డ్ చేతిలో పట్టుకున్న పిల్లల ప్రచార చిత్రాలు ఏర్పాటు చేసారు. భావోద్వేగాలతో ముడిపడిన ఈ తరహా వినూత్న ప్రచారం వాహన దారులను, ప్రయాణీకుల హృదయాలను హత్తుకుంటుంది. 


                    ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ అనంతరం మాట్లాడుతూ..ద్విచక్ర వాహనదారులు మరియు పోలీస్ సిబ్బంది మీడియా సిబ్బంది ఉద్యోగస్తులు ఉద్యోగ నిర్వహణకు వెళ్ళే సమయాలలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హితవు పకికారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను జరిమానాలతో శిక్షించడమే కాకుండా ముందుగా వారికి హెల్మెట్ వలన కలిగే లాభాలను గురించి అవగాహనను కల్పిస్తామని తెలిపారు. ఇంటికి రావడంలో 10 నిమిషాలు ఆలస్యమైనా ఏమీ పర్వాలేదు గాని ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఆ కుటుంబానికి ఎనలేని నష్టం కలిగి, అతనిపై ఆధారపడిన మొత్తం కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గమనించి ప్రయాణం చేయాలని, రహదారి నియమ నిబంధనలను పాటిస్తూ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరాలని విజ్ఞప్తి చేసారు.
                                         ఇంతలో హైవేలో ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై తన కుటుంబ సభ్యులతో వెళుతుండడం గమనించి.. అతనికి మరియు అతని భార్యకి కూడా హెల్మెట్ ను తన చేతుల మీదుగా అందించి హెల్మెట్ యొక్క ఉపయోగాలను గురించి తెలియచేసారు. మహిళలు వారి పిల్లలు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని తెలియజేసి హెల్మెట్ ధరించేలాగా వారికి అవగాహనను కల్పించాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నదని హితవు పలికారు. మహిళలు వారి పిల్లలు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని తెలియజేసి హెల్మెట్ ధరించేలాగా వారికి అవగాహనను కల్పించాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నదని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్, భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుదీర్ బాబు, భీమడోలు ఎస్ఐ సుధాకర్, డిస్టిక్ ట్రాఫిక్ రికార్డు బ్యూరో కానిస్టేబుల్ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి