బాలలను సామాజిక మాధ్యమిక వేదికలు తీవ్ర
ప్రభావితం చేస్తున్నాయన్న తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆస్ట్రేలియా
ప్రభుత్వం చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం దిశగా అడుగులు వేస్తుంది. 16 ఏళ్లలోపు
పిల్లలు సోషల్ మీడియా వినియోగించడానికి అవకాశం లేకుండా రూపొందించిన బిల్ ఆస్ట్రేలియా దేశ
ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టగా 102 మంది సభ్యులు మద్దతు తెలుపగా, కేవలం 13 మంది
సభ్యులు మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. తదుపరి సెనేట్ లో ఆమోదం పొందిన తదుపరి ఈ
బిల్ చట్టంగా మారనున్నది. చిన్నారులకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేదించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా
నిలువనున్నది. ఇదే కనుక అమలు జరిగితే సమీప భవిష్యత్ లో మరిన్ని దేశాలు ఈ
విధానాన్ని అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సోషల్
మీడియా బాధితులుగా మారుతున్న వారిలో చిన్నారులే అధికంగా ఉంటున్నారని విశ్వసనీయత
కలిగిన అధ్యయనాలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.
పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం
ఇప్పటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రతి
ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే, పిల్లలపై దీని ప్రభావం ఆశాజనకమైనదా? ఆలోచించాల్సిన విషయం.
సోషల్
మీడియా ద్వారా వినోదం, విద్య, సృజనాత్మకతకు అనేక అవకాశాలు
లభిస్తున్నాయి. కానీ,
దీని అవకాశాల
మాటున పొంచి ఉన్న దుష్ప్రభావాల గురించి సరైన అవగాహన, వయసు, మానసిక పరిణతి లేని
బాలలు చాలా సులభంగా వాటికీ లొంగిపోయి బానిసలుగా మారుతున్నారు.
నిద్రలేమి
సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల
పిల్లలు రాత్రి తక్కువ గంటలు నిద్రపోతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంలో సమస్యలకు
దారితీస్తోంది.
మానసిక ఆరోగ్య సమస్యలు
అధికంగా సోషల్ మీడియా ఉపయోగించడం వల్ల
పిల్లలు ఒత్తిడికి గురవడం,
ఆత్మవిశ్వాసం
తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇతరుల జీవితాలను చూసి తమను తాము
సరిపోల్చుకోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోంది.
అశ్రద్ధ లేదా ఏకాగ్రతలో లోపం
సోషల్ మీడియా సాధనాలతో ఎక్కువ సమయం గడపడం
వల్ల పాఠశాలలో చదువుపై ఏకాగ్రత తగ్గుతోంది. దీని వల్ల విద్యా ఫలితాలు తగ్గిపోవడం
సాధారణమైంది.
సైబర్ బులీయింగ్
పిల్లలు సోషల్ మీడియాలో సైబర్ బులీయింగ్‌కు
గురయ్యే ప్రమాదం ఉంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, భయాందోళనలను కలిగిస్తుంది.
ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం !
ఈ క్రమంలో ఆస్ట్రేలియా దేశం చేపడుతున్న ఈ
గొప్ప విధానం భవిష్యత్ లో మరిన్ని దేశాలు ..అందులోనూ మన భారతదేశం కూడా అమలు చేసే
అవకాశం ఉంటుందని ఆశించవచ్చా..?
మీ ఆలోచనలు మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను
కామెంట్ల రూపంలో తెలియజేయండి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి