27, నవంబర్ 2024, బుధవారం

చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం..? విప్లవాత్మక నిర్ణయం దిశగా ఆస్ట్రేలియా అడుగులు : Social media ban for kids in Australia

 



చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం..? విప్లవాత్మక నిర్ణయం దిశగా ఆస్ట్రేలియా అడుగులు : Social media ban for kids in Australia


బాలలను సామాజిక మాధ్యమిక వేదికలు తీవ్ర ప్రభావితం చేస్తున్నాయన్న తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రాధాన్యత ఇచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం దిశగా అడుగులు వేస్తుంది. 16 ఏళ్లలోపు పిల్లలు  సోషల్ మీడియా వినియోగించడానికి  అవకాశం లేకుండా రూపొందించిన బిల్ ఆస్ట్రేలియా దేశ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టగా 102 మంది సభ్యులు మద్దతు తెలుపగా, కేవలం 13 మంది సభ్యులు మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. తదుపరి సెనేట్ లో ఆమోదం పొందిన తదుపరి ఈ బిల్ చట్టంగా మారనున్నది. చిన్నారులకు సోషల్ మీడియా వినియోగాన్ని  నిషేదించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలువనున్నది. ఇదే కనుక అమలు జరిగితే సమీప భవిష్యత్ లో మరిన్ని దేశాలు ఈ విధానాన్ని అనుసరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా బాధితులుగా మారుతున్న వారిలో చిన్నారులే అధికంగా ఉంటున్నారని విశ్వసనీయత కలిగిన అధ్యయనాలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.

  పిల్లలలో విపరీత ధోరణులకు బీజం వేస్తున్న మొబైల్ ఫోన్ అతి వాడకం.. #అప్రమత్తం  

 

పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం

ఇప్పటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అయితే, పిల్లలపై దీని ప్రభావం ఆశాజనకమైనదా? ఆలోచించాల్సిన విషయం.
సోషల్ మీడియా ద్వారా  వినోదం, విద్య, సృజనాత్మకతకు అనేక అవకాశాలు లభిస్తున్నాయి. కానీ, దీని అవకాశాల మాటున పొంచి ఉన్న దుష్ప్రభావాల గురించి సరైన అవగాహన, వయసు, మానసిక పరిణతి లేని బాలలు చాలా సులభంగా వాటికీ లొంగిపోయి బానిసలుగా మారుతున్నారు.

నిద్రలేమి

సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లలు రాత్రి తక్కువ గంటలు నిద్రపోతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంలో సమస్యలకు దారితీస్తోంది.

మానసిక ఆరోగ్య సమస్యలు

అధికంగా సోషల్ మీడియా ఉపయోగించడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురవడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇతరుల జీవితాలను చూసి తమను తాము సరిపోల్చుకోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోంది.

అశ్రద్ధ లేదా ఏకాగ్రతలో లోపం

సోషల్ మీడియా సాధనాలతో ఎక్కువ సమయం గడపడం వల్ల పాఠశాలలో చదువుపై ఏకాగ్రత తగ్గుతోంది. దీని వల్ల విద్యా ఫలితాలు తగ్గిపోవడం సాధారణమైంది.

సైబర్ బులీయింగ్

పిల్లలు సోషల్ మీడియాలో సైబర్ బులీయింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, భయాందోళనలను కలిగిస్తుంది.


                                       ఆన్ లైన్ బెట్టింగ్ తో విపరీత అనర్ధాలు..అప్రమత్తం ! 

 

ఈ క్రమంలో ఆస్ట్రేలియా దేశం చేపడుతున్న ఈ గొప్ప విధానం భవిష్యత్ లో మరిన్ని దేశాలు ..అందులోనూ మన భారతదేశం కూడా అమలు చేసే అవకాశం ఉంటుందని ఆశించవచ్చా..?

మీ ఆలోచనలు మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి!

 

21, నవంబర్ 2024, గురువారం

ఉత్తరాఖండ్ ఘోర కారు ప్రమాదం..తలెత్తుతున్న ప్రశ్నలెన్నో..! Uttarakhand car accident Dehradun car accident

                                        

Uttarakhand car accident Dehradun car accident



దేశంలో ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలలో మరణిస్తున్న వారి సంఖ్య, క్షతగాత్రులు అవుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. మితి మీరిన వేగం అధిక ప్రమాదాలకు కారణంగా మారుతుంది. తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో చోటు చేసుకున్న కారు ప్రమాదానికి కూడా అతి వేగమే మృత్యు కుహరంగా మారింది. అందులోనూ ప్రయాణిస్తున్న వారు,   ప్రమాదానికి ముందు జరిగిన పార్టీలో మద్యం సేవించినట్టు సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోలో వెలుగు చూసింది. 

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు హాస్పిటల్ లో విషమ పరిస్థితిలో పోరాడుతున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు. అందరూ స్నేహితులే.   ఒక మిత్రుడు కొత్త కారు కొనడం..దాని నిమిత్తం ట్రీట్ ఇవ్వాల్సిందిగా మిగతా బృందం ఒత్తిడి చేయడంతో విందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆ వినోద సంబరాలను ఆల్కహాల్ మరింత ఉత్తేజభరితం చేసినట్లు తరువాత ప్రచారంలోకి వచ్చిన వీడియోల ద్వారా తెలిసింది. ఆ పార్టీ అనంతరం అందరూ కొత్త కారులో డ్రైవ్ కి సిద్దమయ్యారు. అందరూ  ఉరికే జలపాతాలకు మల్లే నవ యవ్వనంలో పరవళ్ళు తొక్కుతున్నవారే. వారి టీనేజ్ జోరుకు పార్టీ కిక్ మరింత ఆజ్యాన్ని పోసింది. అర్థరాత్రి  ఆ హుషారులో తుఫాన్ వేగంతో నడుపుతున్న కారు అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న ట్రక్ ను బలంగా ఢీ కొట్టింది. ఆ గుద్దుడు ధాటికి కారు టాప్ ఎగిరిపడడమే కాకుండా కారులోని ఇద్దరి తలలు తెగి రోడ్డు పై పడ్డాయంటే ఆ ప్రమాదం ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ప్రమాద స్థలంలోనే దుర్మరణం చెందారు. ఒక యువకుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ కు తరలించబడ్డాడు. 

 యాక్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికే తీయబడిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వైరల్ అయి గగుర్పాటు కలిగించాయి. పూర్తి చిద్రమై రోడ్డుపై చెల్లా చెదురుగా పడివున్న శరీర భాగాలు ఎవరెవరివో కూడా గుర్తించలేని విషాద పరిస్థితుల్లో వున్నాయి. ఈ ఘోర ప్రమాద ఘటన గురించిన సమాచారం తెలిసిన సామాన్య ప్రజలకే ఎంతో వేదన కలిగితే..బాధిత కుటుంబాల విషాదానికి హద్దు ఉంటుందా..? 

తీవ్ర సంచలనం, పెను విషాదం కలిగించిన ఈ ఘోరకలి ఘటన మన సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తుంది...ఈ నవ యవ్వన జీవితాల అర్థాయుస్సు ముగింపుకు కారణం ఏమిటని?...బాధ్యతారాహిత్యం..అవును ముఖ్య కారణం బాధ్యతారాహిత్యమే..ఈ ప్రమాద ఘటనలో బాధితులు అందరూ సంపన్న వర్గానికి చెందిన వారే..వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తమ పిల్లలకు కావాల్సిన స్వేచ్చను ఇస్తున్నామని, కోరినవి కాదనకుండా వారికి సొంతం చేస్తున్నామని మురిసిపోయారే తప్ప...అది తమ బిడ్డల జీవన, వ్యవహార శైలిని ప్రభావితం చేస్తుందని, విశృంఖలత్వానికి దారి తీస్తుందని గుర్తించలేక పోయారు. పిల్లల నడవడికపై కనీస అజమాయిషీ, పర్యవేక్షణ కొరవడి పూర్తి బాధ్యతారాహిత్యానికి పాల్పడి ఇప్పుడు జీవితాంత కడుపుకోత, క్షోభ మిగుల్చుకున్నారు. ఆ యువత కూడా చుట్టూ సమాజంలో ఎందరికో దక్కని అతి ప్రేమ, అతి సౌఖ్యం తమకు దక్కుతుందని గుర్తించి, గౌరవించకుండా..విలాసాలు, విచ్చలవిడి తనానికి ఆకర్షితులై అపాయాన్ని కోరి ఆహ్వానించుకున్నారు..ఇది ఆ యువత బాధ్యతారాహిత్యం..ఈ ఘోర విషాద ఘటన మనలో ఎందరికో హెచ్చరిక అవ్వాలి.. కనువిప్పు కావాలి..మంచి మార్పును తేవాలి..అప్రమత్తం కావాలి..!


14, నవంబర్ 2024, గురువారం

సూట్ కేస్ లో శవం ..నగల కోసం వృద్దురాలిని హత్య చేసిన తండ్రి, కూతురు : Dead body in suite case

సూట్ కేస్ లో శవం Dead body in suitecase

ఏదో ముఖ పరిచయం ఉన్నవారు కదా ఇంటికి ఆహ్వానిస్తున్నారని నమ్మి వెళ్ళిన పాపానికి ఒక పెద్దావిడ తన జీవితాన్ని చేతులారా బలి చేసుకున్న విషాదం నెల్లూరులో చోటు చేసుకుంది. అంతకంతకు మంటగలిసిపోతున్న మానవత్వపు విలువలకు అద్దం పడుతుంది ఈ ఘోరకలి. నెల్లూరు కుక్కలగుంట రాజేంద్ర నగర్ కు చెందిన రమణి అనే 65 సంవత్సరాల వృద్దురాలు కూరగాయలు తెస్తానని బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఎంతకూ ఆమె ఆచూకీ లేకపోవడంతో తెలిసిన అన్ని చోట్ల కుటుంబసభ్యులు, బంధువులు వెతికి, ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంతలో చెన్నై రైల్వే పోలీసుల నుండి  సదరు మహిళ హత్య చేయబడిందని, ఆమె మృతదేహం ఇరువురు వ్యక్తులు ట్రాలీ సూట్ కేస్ లో తరలిస్తూ పట్టుబడ్డారు అన్న సమాచారం తెలియడంతో హతాశులైన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నై బయలుదేరి వెళ్లారు. ఒక మధ్య వయస్కుడు, ఒక యువతి ట్రాలీ సూట్ కేస్ తో రైల్వే ప్లాట్ ఫాం పై  అనుమానాస్పదంగా సంచరించడం, ఆ సూట్ కేస్ నుండి రక్తం కారుతుండడం గమనించిన రైల్వే పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా ఈ ఘోరం వెలుగు చూసింది. పోలీస్ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం..స్వర్ణకారుడు అయిన సుబ్రహ్మణ్యం తన కుటుంబంతో వృద్దురాలు రమణి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నాడు. రమణి ఒంటిపై ఉండే బంగారు నగలను చూసి దుర్భుద్ది పుట్టి, అవి ఎలాగైనా కాజేయాలని పథకం వేసాడు. దానికి అనుగుణంగా సుబ్రహ్మణ్యం అతని కుమార్తె దివ్య ఇద్దరూ కలిసి ఆరోజు కూరగాయల కోసం బయటకు వచ్చిన రమణిని తమకు ఉన్న ముఖ పరిచయంతో ఇంటికి ఆహ్వానించారు. వారి ఆహ్వానంలోని మర్మం గమనించని వృద్దురాలు వారి ఇంటికి వెళ్ళింది. తమ పన్నాగంలో చిక్కిన ఆమెను దుప్పటితో ముఖంపై అదిమిపెట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసారు. అనంతరం ఆమె ఒంటిపై నగలను తీసుకొని, శవాన్ని మాయం చేసే ప్రణాళికలో భాగంగా ముక్కలుగా నరికి ఒక ట్రాలీ సూట్ కేస్ లో ఇరికించారు. ఆ సూట్ కేస్ తీసుకుని తండ్రీ,కుమార్తె నెల్లూరు నుండి చెన్నై వెళ్ళే ట్రైన్ ఎక్కారు. మార్గ మధ్యంలో ఆ సూట్ కేస్ ను ఎక్కడైనా పడేద్దామన్న పథకం తగిన అవకాశం చిక్కకపోవడంతో అమలు చేయలేక పోయారు. చెన్నైలో దిగి మళ్ళీ నెల్లూరు వెళ్ళే ట్రైన్ ఎక్కి ఈసారైన సూట్ కేస్ ని వదిలించుకుందామని ఆ తండ్రి, కూతురు చేస్తున్న ప్రయత్నం రైల్వే పోలీసులు రంగంలోకి దిగడంతో భగ్నం అయ్యింది. సినిమాలు, నవలలు, వెబ్ సిరీస్ లలోను కనిపించే భయానక, హింసాత్మక సీన్ లను నిజ జీవితంలో వాస్తవంగా చేసి చూపించిన ఆ నర రూప రాక్షసులను చూసి పోలీసులే హడలెత్తి పోయారు. సినిమాలు చూసి ఈ తరహా  ఘోరాలకు పాల్పడుతున్నారా..? వాస్తవ సమాజంలో జరుగుతున్న ఇటువంటి అమానుషాలే సినిమాలు, నవలలు, వెబ్ సిరీస్ లకు కథా వస్తువులు అవుతున్నాయా..? అన్నది ఎన్నటికీ  జవాబు దొరకని  ప్రశ్న. ఏది ఏమైనా చిన్న కారణాలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కోరికలు, ఆశలు, అహం సంతృప్తి పరచుకోవడానికి ఎంతో విలువైన ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నామన్న తలపే ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తుంది. ఈ విషాద ఘటన నేర్పుతున్న పాఠం. అపరిచితులతో అతి చనువు ప్రమాదం. చిన్న పిల్లలు, వృద్దుల వంటి అసహాయుల ఒంటిపై విలువైన ఆభరణాలు ఉన్నప్పుడు ఒంటరిగా బయటకు పంపకూడదు. అప్రమత్తం..! 


5, నవంబర్ 2024, మంగళవారం

Helmet Awareness : "క్షేమంగా ఇంటికి రా నాన్నా..!"...హెల్మెట్ వినియోగంపై ఏలూరు జిల్లా పోలీస్ వినూత్న ప్రచారం

Helmet Awareness :   ఏలూరు జిల్లా పోలీస్ వినూత్న ప్రచారం
                          దేశంలో ప్రతిరోజూ జరుగుతున్న రహదారి ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులు కావడం జరుగుతుంది. రహదార్ల నిర్వహణ లోపం, తగిన సామర్ధ్యం లేని వాహనాలు, పరిమితికి మించి రవాణా, సరైన రహదారి భద్రత చర్యలు తీసుకోక పోవడం ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కార్లు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ద్విచక్ర మోటార్ వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ వినియోగించకపోవడం వలనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై ఎంతగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ తగిన స్పందన రావడం లేదు. రోడ్డు ప్రమాద మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో చేస్తున్న వినూత్న ప్రచారం ప్రజలను విశేషంగా ఆకట్టు కోవడంతోపాటు, ఆలోచింప చేస్తున్నది. రోడ్డు ప్రమాదాలలో పూర్తిగా ధ్వంసం అయి ఎందుకు పనికిరాకుండా పడి ఉన్న వాహనాలను నేషనల్ హైవేలో తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో రోడ్డుకు పక్కగా నిలిపి ఉంచుతున్నారు. ఆ వాహనాల వద్ద " నాన్న..పది నిముషాలు ఆలస్యమైన పర్వాలేదు..క్షేమంగా ఇంటికి రండి " అన్న ప్లకార్డ్ చేతిలో పట్టుకున్న పిల్లల ప్రచార చిత్రాలు ఏర్పాటు చేసారు. భావోద్వేగాలతో ముడిపడిన ఈ తరహా వినూత్న ప్రచారం వాహన దారులను, ప్రయాణీకుల హృదయాలను హత్తుకుంటుంది. 


                    ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ అనంతరం మాట్లాడుతూ..ద్విచక్ర వాహనదారులు మరియు పోలీస్ సిబ్బంది మీడియా సిబ్బంది ఉద్యోగస్తులు ఉద్యోగ నిర్వహణకు వెళ్ళే సమయాలలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హితవు పకికారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను జరిమానాలతో శిక్షించడమే కాకుండా ముందుగా వారికి హెల్మెట్ వలన కలిగే లాభాలను గురించి అవగాహనను కల్పిస్తామని తెలిపారు. ఇంటికి రావడంలో 10 నిమిషాలు ఆలస్యమైనా ఏమీ పర్వాలేదు గాని ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఆ కుటుంబానికి ఎనలేని నష్టం కలిగి, అతనిపై ఆధారపడిన మొత్తం కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గమనించి ప్రయాణం చేయాలని, రహదారి నియమ నిబంధనలను పాటిస్తూ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరాలని విజ్ఞప్తి చేసారు.
                                         ఇంతలో హైవేలో ఒక వ్యక్తి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై తన కుటుంబ సభ్యులతో వెళుతుండడం గమనించి.. అతనికి మరియు అతని భార్యకి కూడా హెల్మెట్ ను తన చేతుల మీదుగా అందించి హెల్మెట్ యొక్క ఉపయోగాలను గురించి తెలియచేసారు. మహిళలు వారి పిల్లలు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని తెలియజేసి హెల్మెట్ ధరించేలాగా వారికి అవగాహనను కల్పించాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నదని హితవు పలికారు. మహిళలు వారి పిల్లలు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో హెల్మెట్ యొక్క ఉపయోగాన్ని తెలియజేసి హెల్మెట్ ధరించేలాగా వారికి అవగాహనను కల్పించాల్సిన బాధ్యత మహిళలపై ఉన్నదని గుర్తు చేసారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్, భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుదీర్ బాబు, భీమడోలు ఎస్ఐ సుధాకర్, డిస్టిక్ ట్రాఫిక్ రికార్డు బ్యూరో కానిస్టేబుల్ మధు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

3, నవంబర్ 2024, ఆదివారం

Natural decoction : కషాయంతో కడుపులో కల్మషాలు మాయం

Natural decoction : కషాయంతో కడుపులో కల్మషాలు మాయం
                                ఒకప్పుడు ఇంట్లో తినడం ఎక్కువ..బయట ఆహార పదార్థాలు తినడం బహు అరుదుగా ఉండేది. ఇప్పుడేమో బయట తినడం ఎక్కువైంది. అడుగడుగునా ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన రెస్టారెంట్లు, హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మొబైల్ క్యాంటిన్లు, మిర్చి బడ్డీలు, బేకరీలు ఇలా చాంతాడు అంత ఆహార కేంద్రాల చూపు తిప్పుకోకుండా ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటే ఆగగలమా..? జంక్ ఫుడ్ తో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు, పౌష్టికాహార నిపుణులు నెత్తి, నోరు బాదుకుని చెప్తున్నా తలకు ఎక్కించుకుంటున్నామా..? బిరియానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పానీ పూరీ, చాట్, పునుగులు, మిరపకాయ బజ్జీలు, పిజ్జా, బర్గర్ లతో పాటు రోజు రోజుకీ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న ఆధునిక చిరుతిళ్ళ వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాము. వీటి వల్ల కలిగే మానసిక, శారీరక సమస్యలు పట్టించుకోకుండా తాత్కాలిక జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరుచుకుంటున్నాము.కడుపు నొప్పి, అజీర్తి, మలబద్దకం, గ్యాస్ ట్రబుల్ లాంటి ఉదర సంబంధిత వ్యాధులతోపాటు ఇతర ఎన్నో వ్యాధులకు ఈ జంక్ ఫుడ్ కారణం అవుతుంది. 

                                     మన పూర్వీకులు సహజ సిద్ద కాషాయాలు తయారు చేసుకుని తరచుగా సేవించడం ద్వారా ఉదర ప్రక్షాళన చేసుకొనేవారు. ఆయుర్వేద, సహజ వైద్య ఆరోగ్య విధానాలపై విశ్వాసం ఉన్నవారు ఇప్పటికీ వాటిని అనుసరిస్తూ ఉపశమనం పొందుతున్నారు. అప్పుడప్పుడైనా ఈ సహజ సిద్ద కషాయలు తాగడం ద్వారా జంక్ ఫుడ్ తినడం వలన కలిగే అనర్థాలను కొంతైనా నివారించవచ్చని సిద్ద ఆచార్యులు చెప్తున్నారు. కషాయం అనేది ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడే ఒక ఆవిరి పానీయం. ఇది తేనె, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క వంటి ఔషధ గుణాలు ఉన్న పదార్థాలతో తయారు చేస్తారు. కషాయంలో ఉండే పదార్థాలు శరీరానికి చాలా లాభాలను అందిస్తాయి. 

కషాయం తయారీకి కావలసిన పదార్థాలు: 1. నీరు - 2 గ్లాసులు 2. అల్లం - 1 చిన్న ముక్క, సన్నగా తరిగినది 3. దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క 4. తులసి ఆకులు - 5-6 ఆకులు 5. పుదీనా ఆకులు - 4-5 ఆకులు (ఆప్షనల్) 6. మిరియాలు - 5-6 గింజలు 7. జీలకర్ర - 1/2 టీ స్పూన్ 8. తేనె - 1 టీ స్పూన్ (తర్వాత చల్లారిన తర్వాత కలపాలి)

తయారీ విధానం: 1. మొదట ఒక గిన్నెలో 2 గ్లాసుల నీరు తీసుకుని మరిగించాలి. 2. నీరు మరిగిన తర్వాత అందులో అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, తులసి ఆకులు, పుదీనా ఆకులు (వుంటే), మిరియాలు, జీలకర్ర వేసి మళ్లీ కొంచెం మరిగించాలి. 3. ఇది సగం వరకు మరిగిన తర్వాత దించుకోవాలి. 4. చల్లారిన తర్వాత, కషాయంలో తేనె కలపాలి.

కషాయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: 
1. జలుబు, దగ్గు నయం: ఈ కషాయం తాగడం వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయి. అల్లం, తులసి, మిరియాలు శ్వాస రోగాలను దూరం చేస్తాయి. 

2. జీర్ణశక్తి మెరుగుపడుతుంది: జీలకర్ర, అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. 

3. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఈ కషాయం రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి రక్షణను అందిస్తుంది. 

4. శరీరం డిటాక్సిఫై చేస్తుంది: దాల్చిన చెక్క, పుదీనా వంటివి టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి. 

5. వేడిని  తగ్గిస్తుంది: అల్లం, మిరియాలు శరీరంలోని వేడిని  తగ్గిస్తాయి. శీతాకాలంలో, ఈ కషాయం తాగడం చాలా మంచిది.

2, నవంబర్ 2024, శనివారం

Traditional tips for strong teeth : ధృఢమైన దంతాల కోసం సాంప్రదాయ చిట్కాలు

                      దంతక్షయం..ప్రతి చోట, ప్రతి నోట తరచుగా వినిపిస్తున్న మాట..ప్రతి ఇంట ఎవరో ఒకరిని బాధిస్తున్న సమస్య..పిప్పి పళ్ళు, పళ్ళు విరగడం, చిగుళ్ళ వాపు, రక్తం కారడం, నోటి దుర్వాసన ఇలా పంటికి సంబంధించిన సమస్యలు ఎన్నో. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ పంటి వ్యాధులు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా విపరీతంగా పెరుగుతున్నాయని ఎన్నో వైద్య అధ్యయనాల ద్వారా వెల్లడవుతున్నాయి. ఆధునిక పోకడలు, ఆహారపు అలవాట్లకు దూరంగా పెరిగిన మన పూర్వీకులలో ఈ దంత సమస్యలు అంతగా బాధించలేదు అన్నది వాస్తవం. ఈనాటికీ అనేక మంది వృద్దులలో పంటి సమస్య అంటే తెలియని వారు ఎందరో. తాము బాల్యం నుండి అనుసరించిన సాంప్రదాయ దంత సంరక్షణ విధానాలే తమకు దంత సిరిని తెచ్చి పెట్టాయని వారు గర్వంగా చెపుతుంటారు..ప్రస్తుత ఆధునిక యుగంలో ఆ సంప్రదాయ విధానాలు ఆచరించడం కష్టతరం అయినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 

                                   దృడమైన, ఆరోగ్యవంతమైన దంతాల కోసం మన పూర్వీకులు అనుసరించిన విధానాలు తెలుసుకుందాం. ఇక్కడ పళ్ళను బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని సంప్రదాయ భారతీయ సహజ పద్ధతులు వివరించబడ్డాయి. 


ఈ సహజ పదార్థాలు దంత ఆరోగ్యం పెంపొందించడంలో దోహదపడతాయి: 

1. ఆయిల్ పుల్లింగ్ పదార్థాలు: నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పద్ధతి: ప్రతి రోజు ఉదయాన్నే ఒక చెంచా నూనెను నోట్లో వేసుకుని 10-15 నిమిషాల పాటు కలుపుతూ ఉంచి, తర్వాత ఉమ్మేయాలి. ఇది బ్యాక్టీరియా తగ్గించి, ప్లాక్ నివారించడంలో సహాయపడుతుంది. 

2. వేప కొమ్మలు వేపలో ఉండే సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పళ్ళకు, గడ్డాల ఆరోగ్యానికి చాలా మంచివి. వేప కొమ్మను నమిలి, దంతాలు శుభ్రం చేసుకోవడం ద్వారా పళ్ళకు ఆరోగ్యవంతమైన సంరక్షణ అందుతుంది. 

3. లవంగ నూనె పదార్థాలు: లవంగ నూనె పద్ధతి: కొద్దిగా లవంగ నూనెను గడ్డాలపై స్వాబ్ లేదా కాటన్ ద్వారా అప్లై చేయండి. లవంగం సహజ యాంటీసెప్టిక్ గుణాలతో గడ్డాల ఉబ్బరం తగ్గించి, బ్యాక్టీరియాను అరికడుతుంది. 

4. ఉప్పు మరియు ఆవ నూనె మసాజ్ పదార్థాలు: ఉప్పు మరియు ఆవ నూనె పద్ధతి: కొద్దిగా ఉప్పును కొన్ని చుక్కలు ఆవ నూనెతో కలిపి, చిగుళ్ళపై మసాజ్ చేయండి. ఇది గింజివిటిస్‌ను నివారించి, చిగుళ్ళను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. 

5. బేకింగ్ సోడా మరియు నిమ్మరసం మిశ్రమం పదార్థాలు: బేకింగ్ సోడా మరియు నిమ్మరసం పద్ధతి: బేకింగ్ సోడా మరియు కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేసి, పళ్ళపై అప్లై చేయండి. ఇది పళ్ళపై మరకలను తొలగించి, పళ్ళను తెల్లగా చేయడంలో సహాయపడుతుంది. ఇది వారానికి ఒకసారి మాత్రమే చేయడం మంచిది. 

6. ఆమ్లకీ (ఉసిరికాయ) ఆమ్లకీలో ఉండే విటమిన్ C మరియు యాంటీ ఆక్సిడెంట్లు చిగుళ్ళ ఆరోగ్యం పెంపొందించడంలో సహాయపడతాయి. ఉసిరికాయ జ్యూస్ లేదా పొడిని తింటే దంతాలు, చిగుళ్ళు బలంగా మారుతాయి. 

7. తులసి ఆకు తులసిలో సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. తాజా తులసి ఆకులను నమిలి లేదా పొడిగా చేసుకుని దంతాలకు పేస్ట్ లాగా ఉపయోగించవచ్చు. 

8. జామాకులు సున్నితమైన జామాకులను నమిలితే గడ్డాల ఆరోగ్యం మెరుగవుతుంది. జామాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. 

9. హల్దీ పేస్ట్ పదార్థాలు: పసుపు పొడి మరియు నీరు పద్ధతి: పసుపు పొడిని నీటితో కలిపి పేస్ట్ తయారు చేసి పళ్ళపై, గడ్డాలపై అప్లై చేయండి. ఇది ప్లాక్ ని తగ్గించి, గడ్డాల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. 

10. పండు, కూరగాయల నమిలటం మిరపకాయలు, జామ, కీర వంటి పండ్లు నమిలితే పళ్ళు సహజంగా శుభ్రపడతాయి. అలాగే, గడ్డాలు బలంగా మారి, బ్యాక్టీరియా తగ్గేలా చేస్తుంది. ఈ సహజ పద్ధతులను పాటించడం ద్వారా పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.